Rajahsthan Pushkar Temple.. దైవ దర్శనానికి ఆడ, మగా అనే జెండర్ షరతులుంటాయా.? దేవున్ని అందరూ దర్శించుకోవచ్చు. కానీ, ఓ ఆలయంలో కేవలం స్త్రీలకు మాత్రమే దర్శనం. పురుషులకు నో ఎంట్రీ.!
ఆడవాళ్లలోనూ కేవలం పెళ్లయిన ఆడవాళ్లు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించాలండోయ్. ఏంటీ విచిత్రం అంటారా.? అందుకే ఇదో విచిత్ర దేవాలయం.
Rajahsthan Pushkar Temple.. ఇంతకీ విచిత్ర దేవాలయం ఎక్కుడుందట.?
రాజస్థాన్ లోని అజ్మీర్ కి 11 కి.మీ దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఒక సరస్సు ఉంది. అదే పుష్కర్ సరస్సు.
ఈ సరస్సును ఆనుకుని ఉన్న దేవాలయంలో సృష్టి కర్త బ్రహ్మదేవుని ఆలయం ఉంది. చాలా పురాతనమైన ఆలయం ఇది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా.? పెళ్లయిన మగవాళ్లకు ఇక్కడ ప్రవేశం లేదు.
Rajahsthan Pushkar Temple.. స్థల పురాణం..
పద్మపురాణం ప్రకారం, వజ్రనాధుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడట. ఆ రాక్షస పీడ నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు స్వయానా బ్రహ్మదేవుడు రంగంలోకి దిగాడట.
తన చేతిలోని తామరపువ్వును ఆయుధంగా చేసి విసిరి, ఆ రాక్షసుడిని సంహరించాడట. అప్పుడు ఆ తామర పువ్వు నుండి మూడు రేఖలు నేలపై పడగా, అవి మూడు సరస్సులుగా ఉద్భవించాయట.
వాటిలో ఒకటి ఈ పుష్కర్. బ్రహ్మ చేతి పుష్పం నుండి ఉద్భవించింది కాబట్టి, ఈ సరస్సుకు పుష్కర్ అని పేరొచ్చిందట.
మరో కథనం ప్రకారం, రాక్షస సంహార క్రమంలోనే బ్రహ్మదేవుడు ఓ యజ్నం తలపెట్టాడట. యజ్న, యాగాదులు.. భార్య, భర్తలిరువురూ కలిసి చేయాల్సిన క్రతువులన్నీ చేశారట.
అయితే, యాగ సమయానికి బ్రహ్మ భార్య సరస్వతి రావడం ఆలస్యమైన కారణంగా, బ్రహ్మ దేవుడు, అప్పటికప్పుడు గాయత్రీ దేవిని వివాహం చేసుకుని, ఆమెతో కలిసి ఈ యాగాన్ని పూర్తి చేశాడట.
అది చూసిన సరస్వతి, కోపగించి, ఈ ఆలయంలోకి పెళ్లయిన పురుషులు రావడానికి వీల్లేదు.. అని శపిస్తుందట. అలా పురుషులకు ప్రవేశం లేని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఒకవేళ ఆ నియమాన్ని పట్టించుకోకుండా, వివాహిత పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే, ఇక అంతే సంగతి. వాళ్లను కష్ట నష్టాలు వెంటాడేస్తాయట అదీ అక్కడి జనాల విశ్వాసం.
పెళ్లి కాని పురుషులయితే ఓకే..
ఇక్కడ గోడలపై వెండి నాణాలతో పేర్లు చెక్కబడి ఉంటాయట. తమ పేర్లను వెండి నాణాలపై చెక్కి, భక్తులు ఇక్కడి గోడలకు అతికించడం ఇక్కడ ప్రత్యేకతను చాటుకుంటోంది.
అంతేకాదు, ఇక్కడ ప్రవహించే పుష్కర్ లోని నీటికి చాలా మహిమలున్నాయని అంటుంటారు. అందుకే ఇక్కడికి విచ్చేసిన భక్తులు ఖచ్చితంగా ఈ పుష్కర్‌లో స్నానమాచరిస్తారు.
Also Read: స్వామీ ఆంజనేయా.! నువ్వెక్కడ పుట్టావో చెప్పవయ్యా.!
ఈ పుష్కర్ లో స్నానం చేసి, తర్వాతే గర్భగుడిలోని బ్రహ్మదేవుడిని పూజిస్తారు పెళ్లయిన మహిళలు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం.. పెళ్లి కాని పురుషులు ఈ ఆలయంలోకి రావచ్చు.
ఈ ఆలయ (Rajahsthan Pushkar Temple) నిర్మాణం, శిల్ప కళ చాలా అపురూపమైనది. కేవలం గర్భ గుడిలోకి మాత్రమే వివాహిత పురుషులకు ప్రవేశం లేదు.
కానీ, అపురూపమైన ఈ ఆలయ నిర్మాణాన్ని వీక్షించేందుకు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే.
త్రిమూర్తులుగా భావించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో బ్రహ్మదేవునికి చాలా అరుదుగా మాత్రమే ఆలయాలున్నాయి. దేశం మొత్తంలో కేవలం మూడు బ్రహ్మదేవాలయాలున్నట్లు తెలుస్తోంది.
వాటిలో పురుషులకు ప్రవేశం లేని, ఈ పుష్కర్ బ్రహ్మ దేవాలయం అత్యంత ప్రత్యేకమైనది. విశేషమైనది.