NTR30 Update.. ఓ వైపు గ్లోబల్ స్టార్ అంటున్నారు.. ఇంకో వైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటున్నారు.. చాలాకాలంగా యంగ్ టైగర్.. అని పిలుస్తూనే వున్నారు.! ఇప్పుడెందుకో తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్.!
యంగ్ టైగర్ ఎన్టీయార్ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళడంలో జూనియర్ ఎన్టీయార్ విఫలమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఆలస్యమైనాగానీ, అద్భుతమైన సినిమా రాబోతోంది.. అంటూ ‘ఎన్టీయార్30’ టీమ్ చెబుతున్నా, అభిమానులు ‘తట్టుకోలేక’పోతున్నారు.. ఈ జాప్యాన్ని.!
NTR30 Update.. ‘నా భార్యకంటే’ ముందు మీకే చెప్తానన్నాడుగానీ..
‘నా భార్య కంటే ముందు మీకే చెప్తా..’ అంటూ మొన్నీమధ్యనే ‘అమిగోస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఎన్టీయార్30’ గురించి యంగ్ టైగర్ ఎన్టీయార్ కొంత అసహనం వ్యక్తం చేస్తూ చెప్పాడు అభిమానులకి.
ఎప్పుడు.? ఇంకెప్పుడు.? రోజులు కాదు, నెలలు గడిచిపోతున్నాయ్.. ఏళ్ళు గడిచిపోయేలా వున్నాయ్.!
Mudra369
ప్చ్.. రోజులు గడుస్తున్నాయ్.. ‘ఎన్టీయార్30’ గురించి అప్డేట్ అయితే రాలేదు. నందమూరి తారకరత్న అకాల మరణంతో, ‘ఎన్టీయార్30’ లాంఛింగ్ ఈవెంట్ రద్దయ్యింది.
ఇక, హీరోయిన్ జాన్వీకపూర్ పుట్టినరోజు సందర్భంగా ఓ లుక్ రిలీజ్ చేసి, దాంతోపాటే అప్డేట్ ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అది కూడా వచ్చేలా కనిపించడంలేదు.

దాంతో, అభిమానులు నేరుగా ఎన్టీయార్నే తిట్టిపోస్తున్నారు. దర్శకుడు కొరటాల శివపై బూతుల సంగతి సరే సరి. నిర్మాణ సంస్థలపై తిట్ల ప్రవాహం మరీ దారుణం.!
ఇదిలా వుంటే, యంగ్ టైగర్ ఎన్టీయార్ అమెరికా పయనమైనట్లు తెలుస్తోంది. ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొననున్నాడు ఎన్టీయార్.
Also Read: Rakul Preet Singh Newboo.. కొత్త యాపారం గురూ.!
ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ (రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి తదితరులు) అమెరికాలోనే వున్నారు.
అన్నట్టు, ‘ఎన్టీయార్30’ సినిమా కోసం తెరవెనుక పనులు జోరుగా సాగుతున్నాయట. శంషాబాద్ సమీపంలో భారీ సెట్ వేస్తున్నారట. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లని రప్పిస్తున్నారట.