ఏంది సామీ! నేషనల్ క్రష్ రష్మికకే అంత సీన్ లేదంటారా?

Rashmika Mandanna
Rashmika Mandanna Pushpa Scene.. నేషనల్ క్రష్ రష్మికకు పబ్లిసిటీ ప్రత్యేకంగా చేయాలా.?
చెప్పండి. ఆమెకున్న క్రేజ్‌కి ఏ న్యూస్ అయినా అక్కడికి గాసిప్ అయినా సరే, అదో పెద్ద పబ్లిసిటీనే. అలాంటిదే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రష్మిక మండన్నా రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందనేదే ఆ క్రేజీ న్యూస్. అఫ్‌కోర్స్.! ప్రస్తుతం రష్మిక మండన్నా ఇమేజ్ అలా వుంది మరి.
ఓ వైపు బాలీవుడ్ సినిమాలు, మరో వైపు టాలీవుడ్ సినిమాలు ఇంకో పక్క కోలీవుడ్.. ఇలా ఒక్కటేమిటి బిజీ షెడ్యూల్స్‌తో వుంది రష్మిక మండన్నా.
Rashmika Mandanna Pushpa Scene.. బాలీవుడ్‌లో రష్మిక తగ్గేదే లే.!
మొన్నీ మధ్యనే ‘యానిమల్’ (Rashmika Mandanna Animal) సినిమా కోసం రణ్‌బీర్ కపూర్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసి తన క్రేజ్‌ని రెండింతలు చేసుకుంది బాలీవుడ్‌లో రష్మిక మండన్నా.
ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సిద్ధమైంది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘సికిందర్’ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రష్మిక భారీ పారితోషికం అందుకుంటోందనేదే ట్రెండింగ్ న్యూస్. అది అక్షరాలా 15 కోట్లు అని ప్రచారం జరుగుతోంది.
ఇంతవరకూ నయనతార (Nayanthara), త్రిష (Trisha Krishnan) తదితర సౌత్ ముద్దుగుమ్మలు మాత్రమే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు.
ఏమో నిజమైనా కావచ్చు.! మీకు అర్ధమవుతోందా.?
ఆ లిస్టును దాటేసి, రష్మిక మండన్నా తిరుగులేని స్టార్‌డమ్ దక్కించుకుందని.. తెగ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఏమో.! ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ అయినా కావచ్చు.! దటీజ్ రష్మిక మరి.

‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా హీరోయిన్ ట్యాగ్ కూడా అందేసుకుంది. ఆ సినిమాతో శ్రీవల్లిగా రష్మిక క్రేజ్ ఏ రేంజ్‌కెళ్లిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి పారిపోయిన నాగబాబు.?
తాజాగా రిలీజ్ అయిన ‘పుష్ప 2’ సాంగ్‌లో రష్మిక (Rashmika Mandanna) సిగ్నేచర్ స్టెప్పులు మొదటి పార్ట్‌లో ‘సామీ..’ సాంగ్‌కి మించి ట్రెండింగ్ అవుతున్నాయ్.
ఇంత ట్రెండింగ్‌లో వున్న రష్మిక.. రెమ్యునరేషన్ ఆ రేంజ్‌లో అందుకోవడంలో తప్పేముందట.! అని రష్మిక అభిమానులు ఈ ప్రచారాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారులే.!
