Ramcharan JrNTR English Accent.. సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులకీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకీ మధ్య కొత్త ‘ఫైట్’ షురూ అయ్యింది.
ఈసారి జరుగుతున్నది గ్లోబల్ ఫైట్.! అదేనండీ, ఇంగ్లీషు యుద్ధం.! ప్రస్తుతం రామ్ చరణ్; ఎన్టీయార్.. ఈ ఇద్దరూ అమెరికాలో వున్నారు. ఆస్కార్ వేదికపై కనిపించబోతున్నారు.
భారతీయతని గుండెల్లో మోసుకుంటూ ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద మేం వెళుతున్నాం.. వెళుతున్నది ఎన్టీయార్, రామ్ చరణ్ కాదు..
Ram Charan and Jr NTR
ఈ క్రమంలో ఎన్టీయార్, రామ్ చరణ్ వివిధ టీవీ షోల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ మీడియా, అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీయార్‌లతో స్పెషల్ ఇంటర్వ్యూలు, టాక్ షోలు నిర్వహిస్తుండడం గమనార్హం.
లేట్ అయినా.. లేటెస్ట్ ఎంట్రీ..
వ్యక్తిగత కారణాలతో ఎన్టీయార్ ఎంట్రీ కాస్త ఆలస్యమయ్యింది. ఈలోగా రామ్ చరణ్ చేయాల్సిందంతా చేశాడు, చేస్తూనే వున్నాడు.
ఇప్పుడిక ఎన్టీయార్ వంతు. వస్తూనే, అమెరికాలో అభిమానుల్ని కలుసుకున్నాడు. గుండె లోతుల్లోంచి అభిమానులపై తనకున్న ప్రేమని చాటుకున్నాడు.
ఇక, టాక్ షోల్లో ఎన్టీయార్ మాట్లాడుతున్న ‘యాక్సెంట్’ విషయమై పెద్ద ట్రోలింగ్ జరుగుతోంది. అదే సమయంలో రామ్ చరణ్ స్టైలింగ్ విషయంలోనూ ట్రోల్ చేస్తున్నారు.

ఎన్టీయార్‌ని రామ్ చరణ్ అభిమానుల ముసుగులో కొందరు ట్రోల్ చేస్తోంటే, రామ్ చరణ్‌ని ఎన్టీయార్ ముసుగులో కొందరు ట్రోల్ చేస్తున్నారు. వెరసి.. ఇద్దరూ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
Ramcharan JrNTR English Accent.. రోమ్‌లో వుంటే.. రోమన్‌లా వుండాల్సిందే.!
‘బీ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్’ అంటారు. రోమ్‌లో వుంటే రోమన్‌లా వుండాలని. అమెరికాలో వున్నప్పుడు, అమెరికన్‌లా వ్యవహరించాలి కదా.? ఎన్టీయార్, రామ్ చరణ్.. ఇద్దరూ చేస్తున్నది అదే.
మంచి యాక్సెంట్‌తో చరణ్, ఎన్టీయార్ అమెరికన్ ఇంగ్లీష్ అదరగొట్టేస్తున్నారు. కానీ, కొందరు మాత్రం.. ఈ ఇద్దరి యాక్సెంట్ విషయమై సోషల్ మీడియాలో సెటైర్లేస్తున్నారు.. అదీ ఆయా హీరోల అభిమానుల ముసుగులో.
Also Read: ‘మహా’ కెలుకుడు.! కేజీఎఫ్’పై వెంకటేష్ ‘మసాలా’ మంట.!
దాంతో, గ్లోబల్ స్టేజ్ మీద మన తెలుగు సినిమాని నిలబెట్టిన రామ్ చరణ్, ఎన్టీయార్.. ఇప్పుడీ యాక్సెంట్ రచ్చ కారణంగా పరువు పోగొట్టుకుంటున్నారా.? అన్న చర్చ జరుగుతోంది.
ఈ ట్రోలింగ్ వల్ల అంతిమంగా తెలుగు సినిమా, ఇండియన్ సినిమా పరువు పోతుంది. హీరోలకి ఇలాంటి దురభిమానులుంటారా.?
సినిమా అంటే గిట్టనోళ్ళున్నారా ఇండియాలో.? అని ప్రపంచ వ్యాప్తంగా కొందరైనా అనుకునే పరిస్థితి రావొచ్చు.