Tammareddy Bharadwaj RRR Oscars తప్పొప్పుల పంచాయితీ తర్వాత చూసుకోవచ్చు.! ముందైతే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంచక్కా తెలుగు నేలకు ఆస్కార్ పురస్కారాన్ని తీసుకొచ్చేయాలి.!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. ఆ మాటకొస్తే.. దేశమంతా ‘ఆస్కార్’ (RRR For Oscars) కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నమాట వాస్తవం.
ఇలాంటి తరుణంలో, ‘ఆస్కార్’ కోసమే 80 కోట్లు ఖర్చు చేశారనీ, ఆ సొమ్ముతో పది సినిమాలు తీసి మొహాన కొట్టొచ్చనీ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తీరిందా.? నాగబాబు పెట్టిన వాత సరిపోయిందా.?
రాఘవేంద్రరావు తలంటు పోసిందీ సరిపోలేదా.?
ఇంకోసారి తిట్టించుకోవడానికి ‘నేను నిజాయితీపరుడ్ని’ అంటూ డబ్బా కొట్టుకోవడమేల.?
ఈ వయసులో ఇదంతా అవసరమా.? అసలు తమ్మారెడ్డిని వెనకాల వుండి తరుముతున్నదెవరు.?
Mudra369
‘ఎవడీ తమ్మారెడ్డి భరద్వాజ.?’ అంటూ సగటు సినీ అభిమాని చిరాకు పడుతున్నమాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో, ‘నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను..’ అని తమ్మారెడ్డి వివరణ ఇచ్చి వుంటే బావుండేది.
వివరణ ఇచ్చి.. చీవాట్లు తింటున్న వైనం..
కానీ, తమ్మారెడ్డి అలా చేయలేదు. తనను నాగబాబు, రాఘవేంద్రరావు విమర్శించడంపై గుస్సా అయ్యారు. ‘నా అమ్మ మొగుడి గురించి మాట్లాడతారా.?’ అంటూ విరుచుకుపడిపోయారు.
అంతేనా, ‘అందరి లెక్కలూ నాకు తెలుసు..’ అంటూ మండిపడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ.
ఆ పంచాయితీ తర్వాత చూసుకోవచ్చు. సినీ పరిశ్రమలో ఓ సీనియర్ ఫిలిం మేకర్‌గా తన గౌరవాన్ని తమ్మారెడ్డి నిలబెట్టుకోవాలి.. హుందాగా వ్యవహరించాలి.

అది మానేసి, ‘ఆర్ఆర్ఆర్’పై తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ, నోరు పారేసుకుంటున్నారు.
తప్పు ఒప్పుకుంటే హుందాతనం అవుతుంది. బుకాయిస్తే, బజారుతనం అవుతుందన్నది తమ్మారెడ్డిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్.
Tammareddy Bharadwaj RRR Oscars.. ఏం సాధిద్దామని.?
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీయార్, కీరవాణి.. ఇలా ఒకరేమటి.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చాలామంది చాలా చాలా కష్టపడ్డారు. అందరి కష్టం ఫలించింది. సినిమా విజయవంతమైంది.
అదృష్టవశాత్తూ అంతర్జాతీయ వేదికలపైనా ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. ఇప్పుడు ఆస్కార్ కూడా వెతుక్కుంటూ వస్తోంది.
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
ఈ సందర్భంలో 80 కోట్లు.. అంటూ వ్యాఖ్యానించిన తమ్మారెడ్డి, తన వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకోగలరు.? 80 కోట్లు కాదు, వందల కోట్లు గుమ్మరించగలిగేవాళ్ళున్నారు.. ఇచ్చేస్తారా ఆస్కార్ అవార్డు.?
చిరంజీవి మీద కోపమా.? పవన్ కళ్యాణ్ మీద పగబట్టాడా.? లేదంటే రామ్ చరణ్ మీద ఏడుపా.? దేనికోసం చేస్తున్నావ్ తమ్మారెడ్డీ ఇదంతా.? అనే ప్రశ్నకు ఆయనేం సమాధానం చెప్తాడు.?