Surveen Chawla Rana Naidu.. ఓటీటీ భామ పేరు మార్మోగిపోతోంది.! ఇంతకీ ఎవరీ ఓటీటీ భామ.! పేరేమో సుర్వీన్ చావ్లా. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించింది.
నిజానికి, చాలాకాలం క్రితమే తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ సుర్వీన్ చావ్లా. కాకపోతే, తొలి సినిమానే పెద్ద డిజాస్టర్. దాంతో, మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ.
శర్వానంద్, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజు మహరాజు’ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది సుర్వీన్ చావ్లా.
తెలుగులోనే కాదు..
కన్నడ, తెలుగు, పంజాబీ, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది సుర్వీన్ చావ్లా (Surveen Chawla). ఈ బ్యూటీకి కాస్త పాపులారిటీ తెచ్చిన సినిమా ‘హేట్ స్టోరీ-2’.

నటిగా పలు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, స్టార్‌డమ్ అయితే ఆశించిన స్థాయిలో సుర్వీన్ చావ్లాకి దక్కలేదనే చెప్పొచ్చేమో.
ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్‌లకే పరిమితమవుతోన్న ఈ బ్యూటీ తాజాగా రానా దగ్గుబాటి భార్యగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో నటించింది.
Surveen Chawla Rana Naidu.. బాగానే చేసిందిగానీ..
నిజానికి, ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యత వున్న పాత్రే దక్కింది సుర్వీన్ చావ్లాకి. ఇద్దరు పిల్లల తల్లిగా నటించి మెప్పించింది. భావోద్వేగాలూ పండించగలిగింది.

ప్చ్.. బూతుల మయం అయిపోవడంతో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ని చాలామంది చివరి వరకు చూడటానికే ఇష్టపడటంలేదు.
Also Read: హేయ్ పిల్లా! ఏం చూస్తున్నావ్? ఏం చూపిస్తున్నావ్?
సుర్వీన్ చావ్లా (Surveen Chawla) మాత్రం, తన కెరీర్‌లో ‘రానా నాయుడు’ వెరీ వెరీ స్పెషల్ అంటోంది.
విక్టరీ వెంకటేష్, రాానా దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా తదితరులు నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో వుంది.