Nagachaitanya Custody.. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘కస్టడీ’ సినిమా నుంచి టీజర్‌ని రివీల్ చేశారు.! నాగచైతన్య వాయిస్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది.
స్టార్టింగ్ టు ఎండింగ్.. మంచి టెంపో మెయిన్‌టెయిన్ అయ్యేలా టీజర్‌ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్లుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్.
‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది…’ అంటున్నాడు అక్కినేని హీరో నాగ చైతన్య. ఇంతకీ చైతూ మనసు ఎందుకు గాయపడింది.? ఏంటా కథ.?
నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’లోనిదీ డైలాగ్. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు చైతూ టీజర్‌లో.
Also Read: ‘ఆస్కార్’ నాటు: అప్పడు చరణ్.. ఇప్పుడు దీపిక.!
‘చావు నన్ను వెంటాడుతోంది.. నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం..’ వంటి బలమైన డైలాగులతో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది.
‘నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం..’ అంటూ డైలాగ్స్‌లో చాలా డెప్త్ వినిపిస్తోంది. టీజర్‌లో అక్కడక్కడా రెట్రో లుక్స్ కూడా కనిపిస్తున్నాయ్.
‘కస్టడీ’తో చైతూ గట్టిగా కొట్టబోతున్నాడు..
చూస్తుంటే, నాగ చైతన్య కోరిక తీరేలా వుంది ‘కస్టడీ’ సినిమాతో. మాస్ హీరో అనిపించుకోవాలన్నది నాగ చైతన్య కోరిక. ఎప్పటి నుంచో ఆ దిశగా ట్రైల్స్ వేసినా బెడిసికొట్టాయ్.

కానీ, ఈ సారి వర్కవుట్ అయ్యేలానే వుంది ‘కస్టడీ’తో. తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగ చైతన్య ఈ సినిమా కోసం.
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) సినిమాలు కంటెంట్ రిచ్‌గా వుంటాయ్.
చైతూ ‘కస్టడీ’లో వున్న ఆ నిజమేంటీ.?
చైతూతో (Akkineni Nagachaitanya) ఈ కాంబో సెట్టయినప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయ్. టీజర్‌తో ఆ అంచనాల్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లారు.
నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా నుంచి వచ్చిన టీజర్‌లోని డైలాగులు ఇవీ..
గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది…
అదిప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి..
ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది..
అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో నాకు తెలియదు..
తెలుసుకోవాలని కూడా లేదు..ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం..
నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం.. యెస్.. దట్ ట్రూట్ ఇన్ మై కస్టడీ..
Mudra369
బేబమ్మ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తున్న ‘కస్టడీ’కి మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
చూడాలి మరి, చైతూ ‘కస్టడీ’లో వున్న ‘నిజం’ అనే ఆ ఆయుధం ఏంటీ.? ఆ ఆయుధంతో చైతూ చేయబోయే యుద్ధం ఎలా వుండబోతోంది.? తెలియాలంటే మే12 వరకూ ఆగాల్సిందే.