Table of Contents
Vidudala Part 1 Review.. ఇలాంటి సినిమాలు తెలుగు తెరపై చూడలేదా.? ఏం, ఎందుకు చూడలేదు.. చాలానే వచ్చాయ్.! కాకపోతే, ఇది ఇంకాస్త ప్రత్యేకమైనది.!
వెట్రిమారన్ సినిమాలంటే, అందులో ‘స్వచ్ఛత’ ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్వచ్ఛత, అంటే ‘నిజం’ అని అనుకోవచ్చు.!
అంతా నిజమే తీశాడా.? అంటే, నిజాలే ఎక్కువగా చూపించాడనీ భావించొచ్చు. ‘విడుదలై పార్ట్ వన్’ సినిమా చూశాక.. ‘వావ్’ అనకుండా వుండలేం.!
Vidudala Part 1 Review.. కానిస్టేబుల్ కుమరేశన్ కథ..
ఓ రైలు ప్రమాదం, ఈ క్రమంలో పోలీసులు నక్సలైట్లను అంతమొందించేందుకు ప్రయత్నించడం.. ఇదీ సినిమా కథ.
నక్సలైట్లకు మద్దతిస్తున్నారంటూ గ్రామస్తుల్ని పోలీసులు వేధించడం చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమాలో అది వేరే లెవల్లో కనిపిస్తుంది.
పోలీసులు అందరూ కుమరేశన్లా మంచోళ్ళయి వుంటారా.? లేదంటే, మిగతా అధికారుల్లా దుర్మార్గులుగా వుంటారా.?

వాళ్ళూ.. వీళ్ళూ వుంటారు.! అందుకే, ఇది కుమరేశన్ కథ. పోలీసులోని మానవత్వాన్ని చూపించారు కుమరేశన్ పాత్ర ద్వారా. అదే సమయంలో ఇతర పాత్రల ద్వారా పోలీసులోని కర్కశత్వాన్నీ చూపించారు.
ఫలానా పాత్రలో నటించిన నటుడెవరు.? అన్న చర్చ అనవసరం. ఎందుకంటే, తెరపై పాత్రలే కనిపిస్తాయ్.. ఆ పాత్రల్లో నటీనటులు జీవించారంతే.
కమెడియన్ సూరి.. కొత్త కోణంలో..
ఈ సినిమాలో మనకు పరిచయం వున్న నటీనటులు ముగ్గురే. ఒకరు సూరి, ఇంకొకరేమో విజయ్ సేతుపతి, మరొకరేమో గౌతమ్ మీనన్.
సూరిని కమెడియన్‌గా చూశాం. కానీ, ఇందులో అతనే హీరో.! విజయ్ సేతుపతి మంచి నటుడు.. ఆయన నటనా ప్రతిభను మరింతగా ఎలివేట్ చేసిన సినిమా ఏమీ కాదిది.
హీరోయిన్ భవానిశ్రీ బాగా చేసింది. సినిమా మొత్తానికీ అన్నీ తానే అయి.. అన్నట్లు కుమరేశన్ పాత్రలో సూరి ఒదిగిపోయాడు.
Also Read: పులుల్ని వేటాడే పులి.! ఏంటి టైగరూ ఈ ఓవరు.!
సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. ఒక్కో ఫ్రేమ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సాధారణ సన్నివేశాల్ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళింది.
రాజీ పడే ప్రసక్తే లేదు..
వెట్రిమారన్ అంటేనే రాజీ పడని నైజానికి నిలువెత్తు నిదర్శనం. ఇందులోనూ అదే కనిపిస్తుంది. నిర్మాణపు విలువలు బావున్నాయి.
నక్సలైట్ లీడర్ దొరికేశాడు.. తర్వాతేంటి.? అది ‘విడుదలై రెండో పార్ట్’లో చూడాల్సి వుంటుంది.
చివరగా పాత్రల పేర్లు విన్నప్పుడు.. ఇది డబ్బింగ్ సినిమా అనిపిస్తుందేమోగానీ, సినిమా చూస్తున్నంతసేపూ ఆ భావన అస్సలు కలగదు.