Tamannaah About Vijay Varma.. మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పేసుకుంది.! ఔను, ఆమె ఒప్పేసుకుంది.. తాను ఒకరితో ప్రేమలో వున్నానని.
ఆ ఒకరు ఎవరో కాదు, నటుడు విజయ్ వర్మ. అదేనండీ, తెలుగులో నేచరల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘ఎంసీఏ’ సినిమాలో విలన్‌గా నటించాడు కదా, ఆ విజయ్ వర్మే.!
గత కొంతకాలంగా విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తోందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Tamannaah About Vijay Varma.. అప్పుడు తూచ్ అనేశారుగానీ..
తమన్నాతో తాను ప్రేమలో వున్నానన్నది కేవలం ప్రచారం మాత్రమే.. మేమిద్దరం జస్ట్ ‘కో-స్టార్స్’ అంటూ తొలుత కవరింగ్ ఇచ్చుకున్నాడు విజయ్ వర్మ.
ఇక, మిల్కీ బ్యూటీ తమన్నా సంగతి సరే సరి. తనకిప్పడు ప్రేమించేందుకు తగిన సమయమే దొరకట్లేదంటూ కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది.

కానీ, ఇంతలోనే.. ‘ఔను, మేమిద్దరం ప్రేమలో వున్నాం..’ అని స్వయంగా తమన్నా ప్రకటించేసింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందట.
అతనితో ప్రేమలో ఎందుకు పడ్డానంటే..
కేవలం సహ నటుడు అనే కాదు.. నా పట్ల ఎంతో బాధ్యతగా వుంటాడు.. అందుకే అతనితో ప్రేమలో పడ్డానని చెబుతోంది తమన్నా.
Also Read: Kriti Sanon.. ఓ సీత.! ఓ కాంట్రవర్సీ.! ఓ ‘ఆదిపురుష్’.!
‘విజయ్ వర్మ నాతో వుంటే, నేను మరింత సెక్యూర్డ్‌గా ఫీలవుతాను.. అందుకే, అతన్ని స్నేహితుడిగా, ప్రేమికుడిగా భావిస్తున్నాను..’ అని తమన్నా చెప్పుకొచ్చింది.
ఇంతకీ, పెళ్ళెప్పుడు.? అనడిగితే మాత్రం, ‘దానికింకా చాలా సమయం వుంది. మేమిద్దరం ఇంకా పరస్పరం అర్థం చేసుకోవాల్సింది చాలా వుంది’ అన్నది తమన్నా వెర్షన్.!