Iswarya Menon Pawan Kalyan.. ఆమెకి పవన్ కళ్యాణ్ కావాలట.! పవన్ కళ్యాణ్‌తో నటించాలని ఏ హీరోయిన్ మాత్రం అనుకోదు.? ఆ స్టైల్.. ఆ స్వాగ్.. అది వేరే పవర్.!
అసలు విషయమేంటంటే, ‘స్పై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఐశ్వర్య మీనన్, తాను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానినంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
వెయ్.. కోతలు కొయ్.! అనాలనిపిస్తోంది కదా.?
పవన్ కళ్యాణ్ గురించిన ప్రస్తావన రాగానే ఆమె కళ్ళల్లోని స్పార్క్.. ఆమె బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ చూస్తే.. నిజంగానే ఐశ్వర్య, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.. అనిపించడం ఖాయం.!
ఓసారి కలవాలని.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాలని..
పవన్ కళ్యాణ్‌ని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటోందిట. ‘ఖషీ’ సినిమాని తమిళంలోనూ, తెలుగులోనూ చూసిందట. అప్పటినుంచే పవన్ కళ్యాణ్‌కి అభిమాని అయిపోయిందట ఐశ్వర్య మీనన్.

అద్గదీ అసలు సంగతి.! చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆమె ఆ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌ని కాస్సేపు ప్రదర్శించేసింది.
Iswarya Menon Pawan Kalyan.. అది నిజమేనా.?
‘ఓజీ’ సినిమా కోసం ఐశ్వర్య మీనన్ ఓ చిన్న రోల్‌లో నటించబోతోందన్న ప్రచారం తెరపైకొచ్చింది. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.
ఇక, ‘స్పై’ విషయానికొస్తే, నిఖిల్ సిద్దార్ధ ఈ సినిమాలో హీరోగా నటించాడు. నిఖిల్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అని.!