Mole Rat Human Life.. ఎలుక అంటే.. కొంతమందికి భయం.! కొంతమందికి అదో సరదా.! ఎలుకల్ని పెంచుకునేవాళ్ళున్నారు.. వండుకుని తినేసేటోళ్ళూ వున్నారు.!
ఎప్పుడైనా ఊహించారా.? ఆ ఎలుకే, మీ జీవిత కాలాన్ని పెంచగలదని.! అయితే, అన్ని ఎలుకలూ కాదండోయ్.! కొన్ని ఎలుకలకి మాత్రమే.. ఆ ప్రత్యేకమైన శక్తి వుంది.!
ఆ ఎలుక మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది.! కానీ, ఇప్పుడే కాదు.. అలా జరగడానికి ఇంకొన్నేళ్ళు పట్టొచ్చు.
Mole Rat Human Life.. ఎక్కడుంది ఆ ఎలుక.? ఆ సంగతేంటి.?
ఎలుకలు, కుందేళ్ళు.. వీటి మీద ఎక్కువగా ప్రయోగాలు జరుగుతుంటాయ్.. అది కూడా, వివిధ రోగాలకు సంబంధించి తయారు చేసే వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రయోగాలు.!
అలా, ఇప్పుడు కొన్ని ఎలుకలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎలుక జాతికే చెందిన ఓ ప్రత్యేకమైన ఎలుక జీవన సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు కొందరు సైంటిస్టులు.

అంతే, ఆ ఎలుకల్లోని ప్రత్యేకమైన జీన్స్‌ని తీసి, సాధారణ ఎలుకల్లో ప్రవేశపెట్టి, విజయం సాధించారు.! ఇకనేం, ఆ తర్వాత ప్రయోగాలు మనుషులకు సంబంధించి జరగబోతున్నాయ్ అన్నమాట.!
సాధారణ ఎలుకలతో పోల్చితే, ఆ ప్రత్యేకమైన ఎలుకల జీవిత కాలం పది రెట్లు ఎక్కువట. ఆ ప్రత్యేకమైన ఎలుకల పేర్లు ‘నేక్‌డ్ మోల్ ర్యాట్’.! దీన్నే, శ్యాండ్ పప్పీ అని కూడా అంటారు.
ఆఫ్రికాలో అరుదైన ఎలుక..
ఆఫ్రికా దేశాల్లో.. అందునా, కెన్యా దేశంలో వీటి జాడ దొరుకుతుందట. దురదృష్టం, ఇవి కూడా అంతరించే దశలో వున్నాయ్.!
ఈ భూమ్మీదకి ఏ జీవమైనా అతిధిగా వచ్చిందే. వచ్చాం.. వెళ్ళిపోతాం.! ఎక్కువ కాలం బతికేయాలన్న కక్కుర్తితో, కనిపించిన ప్రతి జీవినీ నాశనం చేసుకుంటూ పోతే ఎలా.?
పెరుగుట విరుగుట కొరకే.! జీవిత కాలం పెరగడమంటే, నానా రకాల దరిద్రాల్నీ చూడాల్సి వస్తుంది.! క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నాం.. వాడుతున్న అనేక మందుల వల్ల.
Also Read: చంద్రయాన రాజకీయం.! నవ్విపోదురుగాక.!
అన్నట్టు, ఈ ‘నేక్‌డ్ మోల్ ర్యాట్’లోని జీన్స్, క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయటండోయ్.! ఎప్పట్లోగా, ఈ ‘నేక్‌డ్ మోల్ ర్యాట్’ జీన్స్ ద్వారా మనుషులకి లాభం చేకూరుతుంది.?
అదైతే, ప్రస్తుతానికి సస్పెన్స్.! పాపి చిరాయువు.. అన్నారు పెద్దలు.! ఎక్కువ ఆయుష్షు కోసం.. పాపుల్లా తయారైపోతున్నామన్నమాట.!