Bigg Boss Telugu Shakila షకీలా.! ఈ పేరు తెలియనివారు లేరనడం అతిశయోక్తి కాదేమో.. కానీ, అది ఒకప్పుడు.!
అప్పట్లో, షకీలా పేరు మార్మోగిపోయింది.. దేశవ్యాప్తంగా.! మలయాళ సినీ పరిశ్రమలో అయితే, స్టార్ హీరోలు సైతం, ఆమెను చూస్తే వణికిపోయేవారు.
కాదు కాదు, షకీలాని చూసి కాదు.. ఆమె సినిమాల్ని చూసి భయపడేవారు. ఆమె సినిమాలు వస్తున్నాయంటే, తమ సినిమాల్ని వాయిదా వేసుకునేవారు అగ్ర హీరోలు.!
వారానికో సినిమా వచ్చేది షకీలా నుంచి. మలయాళంలో లేడీ సూపర్ స్టార్ అయిపోయిందామె అప్పట్లో. కానీ, అవన్నీ బీ-గ్రేడ్ సినిమాలే.
Bigg Boss Telugu Shakila.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎలా వచ్చిందబ్బా.?
తెలుగులోనూ ఒకటీ అరా సినిమాలు చేసింది షకీలా.! దాదాపుగా అన్నీ కామెడీ రోల్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కామెడీ అంటే, అది కూడా ఒకింత వల్గర్ కామెడీ. వ్యాంప్ తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది షకీలా.!
ఇంతకీ, బిగ్ బాస్ హౌస్‌లోకి షకీలాని ఎందుకు తీసుకొచ్చినట్లు.? ఏమోగానీ, ఫేడవుట్ అయిపోయిన షకీలీ, ఇప్పుడీ బిగ్ బాస్ పుణ్యమా అని లైమ్‌లైట్‌లోకి వచ్చిందనుోవాలేమో.!
Also Read: విజయ్ దేవరకొండ, సమంత.! ‘లిప్పు లాకు’ వెనుక.!
బూతు సినిమాలకే పరిమితమైన షకీలా, ఇప్పుడ ప్రతి రోజూ మన ఇంట్లో, మన టీవీ సెట్‌లో కనిపించబోతోంది.!
చాలా విషయాలు చెప్పబోతోందట షకీలా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి. అఫ్‌కోర్స్.. అలాగే డిజైన్ చేస్తాడు బిగ్ బాస్ కొన్ని టాస్కుల్ని.!
టైటిల్ ఎగరవేసేంత సీన్ లేదు షకీలాకి. ఓ రెండు మూడు వారాల్లో ఆమెని ఇంటికి పంపించేయొచ్చు. అగ్రిమెంట్లు కూడా అలాగే చేసుకున్నారని వినికిడి.
ఏమో, మొదటి వారమే ఆమెను బయటకు తోసేస్తారేమో.! బిగ్ బాస్ తలచుకుంటే ఏమైనా చేయగలడు.! ఏమో, ఇంకొన్ని రోజులు.. కాదు కాదు, వారాలపాటు ఆమెని హౌస్‌లో వుంచాలనుకుంటే.!
అయినా, యంగ్ తరంగ్.. కంటెస్టెంట్లతో షకీలా పోటీ పడగలదా.? మరీ ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో షకీలా పరిస్థితేంటి.?