Jr NTR Sreeleela SIIMA.. అవార్డులు కొనుక్కుంటే వస్తాయన్న విమర్శ ఈనాటిది కాదు.! మరి, అందరూ కొనేసుకోగలరు కదా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
జాతీయ ఉత్తమ నటుడిగా ఇటీవల అల్లు అర్జున్ (Stylish Icon Star Allu Arjun) ఎంపికైనప్పుడే, చాలా విమర్శలు వచ్చాయ్. అవార్డులన్నాక ఈ విమర్శలు మామూలే.
తాజాగా, ‘సైమా’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ‘సైమా’ అవార్డులంటే, ఆ ఈవెంట్‌కి ఎవరైతే రాగలరో, ఆ స్టార్లను.. అలాగే వారి స్టార్‌డమ్‌ని పరిగణనలోకి తీసుకుని ఇస్తారన్నది ఓ బలమైన వాదన.
Jr NTR Sreeleela SIIMA.. జూనియర్ ఎన్టీయార్‌కి అలాగే..
నో డౌట్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ అత్యుత్తమ నటనా ప్రతిభను కనబర్చాడు. జూనియర్ ఎన్టీయార్, ‘సైమా’ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం స్వాగతించాల్సిన విషయమే.

మరి, రామ్ చరణ్‌ని (Mega Power Star Ramcharan) ఎందుకు లైట్ తీసుకున్నట్టు.? అల్లు అర్జున్ (Allu Arjun) పేరెందుకు ప్రస్తావనకు రాలేదు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) మీద ట్రోలింగ్ మామూలే. పొలిటికల్ యాంగిల్‌లో ఈ ట్రోలింగ్ జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి.
‘ఉత్తమ’నటి శ్రీలీల.?
‘ధమాకా’ సినిమాలో శ్రీలీల నటన చూస్తే, చాలామందికి చిరాకొస్తుంది. కానీ, సినిమా హిట్టు.! అలా వర్కవుట్ అయిపోయిందంతే.
ఆ ‘ధమాకా’ (Dhamaka Movie) సినిమాలో శ్రీలీల (Sreeleela) నటనకు ‘సైమా’ ఉత్తమ నటి అవార్డు దక్కడం చాలామందికి షాక్ ఇచ్చింది.
Also Read: సలారూ.! నిన్ను ఎందుకు వెనక్కి నెట్టేశారూ.!
శ్రీలీల (Sreeleela) ‘ఉత్త’మ నటి కాబట్టి, జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) కూడా ‘ఉత్త’మ నటుడేనంటూ ర్యాగింగ్ షురూ అయ్యింది.
ఇదొక కమర్షియల్ ఈవెంట్.! ఇక్కడి అవార్డుల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. ట్రోలింగ్ చేయాల్సిన పనీ లేదు.
కానీ, అవార్డులు నటీనటులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయ్.! ఇక, ట్రోలింగ్ అంటారా.. నిజాయితీగా అవార్డులొచ్చినా, ట్రోలింగ్ తప్పడంలేదు నటీనటులకి.!