Shruti Haasan The Eye.. విశ్వనటుడు కమల్ హాసన్ తనయగా సినీ తెరకు పరిచయమైనప్పటికీ శృతి హాసన్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లోనూ తన సత్తా చాటింది.
తెలుగులో ‘గబ్బర్ సింగ్’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలతో ఆ స్టార్‌డమ్‌ని కొనసాగించింది.
అదే టైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లోనూ జోరు ప్రదర్శించింది శృతి హాసన్. కానీ, ప్రేమ, పెళ్లి అంటూ మధ్యలో కాస్త డిస్టర్బ్ అయ్యింది.
Shruti Haasan The Eye.. సైకలాజికల్ థ్రిల్లర్ వెరీ వెరీ స్పెషల్.!
దాంతోనే కెరీర్ కూడా డిస్టర్బ్ అయ్యింది శృతి హాసన్‌కి. కొన్నాళ్లు సినిమాలకు దూరమైన శృతిహాసన్ ఈ మధ్యనే మళ్లీ యాక్టివ్ అయ్యింది.
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది.

ప్రస్తుతం ‘సలార్ (Salar)’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా వుంటే, శృతి హాసన్ గ్లామర్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ అందుకోబోతోందని చెప్పొచ్చేమో. ఓ హాలీవుడ్ సినిమాలో శృతి హాసన్ ఛాన్స్ కొట్టేసింది.
అక్కడ ఓ ప్రెస్టీజియస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో శృతి హాసన్ నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా గొోప్పతనాన్ని వివరిస్తూ శృతి హాసన్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యింది.
మేకింగ్ పర్యావరణ హితంగా..
రిలీజ్ కాకుండానే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కి నామినేట్ అయ్యిందని శృతి హాసన్ తెలిపింది.
బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్ర్కీనింగ్‌కి ఈ సినిమా నామినేట్ అయ్యిందట.
అలాగే, బెస్ట్ ఫిలిం కేటగిరీలో లండన్ ఇండిపెండెంట్ ఫిలిం విభాగంలోనూ ఈ సినిమా నామినేట్ అయ్యిందని శృతి తెలిపింది.

ఇంతకీ ఈ సినిమా పేరేంటో చెప్పలేదుగా.! ‘ది ఐ (The Eye)’. డాప్నే ష్మోన్ ఈ సినిమాకి దర్శకుడు.
‘ది లాస్ట్ కింగ్‌డమ్’ ఫేమ్ మార్క్ రోలీ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఓ ఐలాండ్‌లో మరణించిన తన భార్త అస్థికల కోసం అక్కడికి వెళ్లిన ఓ యువ వితంతువు కథే ‘ది ఐ (The Eye)’.
Also Read: పెళ్ళి పుకార్లపై సాయి పల్లవి సీరియస్సూ.!
ఆసక్తికరమైన సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాని పర్యావరణ హితంగా తెరకెక్కించారనీ తెలుస్తోంది.. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమైనదనీ.. రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని శృతి హాసన్ చెబుతోంది.
ఇప్పటికే ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె తదితర ముద్దుగుమ్మలు హాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఐ’ సినిమాతో ఆ లిస్టులో శృతి హాసన్ పేరు కూడా చేరుతుందేమో చూడాలి మరి.!