Akkineni Nagachaitanya Dhootha.. సినిమా అవ్వండీ.. ఇంకోటి కానీయ్యండి.. కొన్నింటిని చూస్తున్ననప్పుడు, ‘ఇది నిజమైపోతేనో..’ అన్న భయం కలగడమంటే, అది బాగా ‘టచ్’ చేసిందనే అర్థం.!
అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో ‘ధూత’ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. నాగచైతన్య నటనా ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
నిజానికి, ఈ వెబ్ సిరీస్ చేయడానికి నాగచైతన్య ముందుకొచ్చాడంటేనే.. అతనికి మంచి టేస్ట్ వున్నట్టు లెక్క.
Akkineni Nagachaitanya Dhootha.. ‘దూత’లో ఏముంది.?
పోలీస్, రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు.. ఈ ముగ్గురూ సమాజం మీద చూపే ఇంపాక్ట్.. అందరికీ తెలిసిందే.
పై ముగ్గురూ కుట్రపూరిత మనస్తత్వం కలిగిన వ్యక్తులైతే.? అదే, ‘దూత’ వెబ్ సిరీస్‌లో ‘కీ’లకమైన పాయింట్.!
ఓ కరప్టడ్ జర్నలిస్ట్ జీవితంలో ఎదురైన సంఘటనలు, చివరికి అతను తన తప్పు తెలుసుకోవడం.. ఇదంతా ‘దూత’లో చూస్తాం.!
ఇక్కడ, ఇదంతా రాస్తున్నప్పుడు, ఆ సన్నివేశాలు తలచుకుంటే, ఒకింత భయం వేస్తోందనడం అతిశయోక్తి కాదేమో.
ఇదే నిజమైతేనో.!
‘దూత’ వెబ్ సిరీస్‌లో చూపించినట్లే నిజ జీవితంలోనూ జరిగితే.? ఆ ఆలోచనే అత్యంత భయంకరం. కానీ, నిజమైతే.. అసలంటూ పోలీస్ వ్యవస్థలో తప్పులు జరగవు.. రాజకీయ వ్యవస్థలోనూ అక్రమార్కులకు ఆస్కారమే వుండదు.
మీడియా సంగతి సరే సరి.! కానీ, ఈ మూడు వ్యవస్థలూ ఎప్పుడో భ్రష్టుపట్టిపోయాయి. ‘దూత’లా ఎవరైనా ఆయా వ్యవస్థల మీద పగబడితే.?
ఒక్కరంటే ఒక్కరు కూడా.. ఆ మూడు వ్యవస్థల్లో ఎవరూ బతికే అవకాశం లేదన్నంతగా మారిపోయాయి ఆ మూడు వ్యవస్థలూ ప్రస్తుతం.
Also Read: సామి చెప్పిండు.! ఓ పదిహేనేళ్ళు ఎన్నికలు మానేయిండ్రి.!
రాజకీయాల్లో క్రిమినల్స్‌కి సెల్యూట్ చేస్తున్న పోలీసులు.. మీడియాని కంట్రోల్ చేస్తున్న రాజకీయం.. ఆ రాజకీయానికి వత్తాసు పలుకుతున్న మీడియా.. ఇదీ నేటి తీరు.!
వచ్చి తీరాలి.. ఏదో ఒక ఆత్మ ‘దూత’ రూపంలో.! వస్తుందా మరి.?
చివరగా..
‘దూత’ మీద ఓ సమీక్ష రాయాలనుంది. ఎప్పుడు కుదురుతుందో ఏమో.! అప్పటిదాకా దీన్నే సమీక్ష అనుకుంటే పోలా.?