Trivikram Srinivas Kurchi Madathapetti.. గురువు గారూ.. గురువు గారూ.. అంటూ ‘డాష్’లో.. అని వెనకటికి ఓ ముతక సామెత వుంది.!
గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయమై ఇప్పుడీ ప్రస్తావన తెస్తున్నారు చాలామంది నెటిజనం.!
అసలు గురూజీ అంటే ఎవరు.? త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ‘గురూజీ’ అని ఎందుకు అంతమంది అభిమానంతో ‘శిష్యరికం’ చేస్తుంటారు.?
వేదికలెక్కి మంచి మాటలు చెబుతారు. సినిమాల్లోనూ మంచి మంచి మాటల్ని చెబుతుంటారు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత.
అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ‘ఖలేజా’ సినిమా వచ్చింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమా రాబోతోంది.!
Trivikram Srinivas Kurchi Madathapetti.. కుర్చీ మడత బెట్టి.. ఏం చేయాలని.?
మహేష్‌బాబు, శ్రీలీల మీద ‘గుంటూరు కారం’ కోసం ఓ మాంఛి మసాలా సాంగ్ డిజైన్ చేశారు. ‘కుర్చీ మడత బెట్టి..’ అంటూ సాగుతుందీ పాట.
వామ్మో బూతు.. అంటూ కొందరు చెవులు మూసుకుంటున్నారు.
అదేంటీ, నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాలో ‘పిల్ల మొగ్గ’ అని పదే అంటోంటే అందులో వినిపించని బూతు, ఇప్పుడు ‘కుర్చీ మడత బెట్టి’ అంటే, ఎలా బూతుగా వినిపించింది.? అనే డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కాదు.!
అనిల్ రావిపూడి సినిమాలో బూతులుంటాయ్. కామెడీ పేరుతో బూతుని నమ్ముకున్న దర్శకుడాయన.
కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత గౌరవం సంపాదించుకున్నాడు కదా, దర్శకుడిగా.! అప్పుడెప్పుడో ఓ వేదికపై, ‘బూతు కామెడీ’ గురించి లెక్చర్ దంచాడు త్రివిక్రమ్.
ఈ బూతులేంటి.?
దురదృష్టం, త్రివిక్రమ్ ఎప్పుడో కామెడీ కోసం బూతుల్ని ఆశ్రయించేశాడు. పాటలో ఓ చిన్న మాట.. ‘కుర్చీ మడత బెట్టి’ అనే బూతు మాట.. మరీ అంతగా ఫీలైపోవాల్సిన పనేం లేదు.
ముందు ముందు చాలా దరిద్రాల్ని సినిమాల్లో చూడబోతున్నాం. ఫలానా హీరో, ఫలానా దర్శకుడు.. అనుకోవాల్సిన పనిలేదు. అందరూ అంతే.!
బూతు సినిమా.. అంటే, ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కి పొడుసుకొచ్చేయలేదా.? త్రివిక్రమ్ కూడా అంతేనేమో.!
Also Read: Shruti Haasan.. అదే దాచలేదు.! ఇదెందుకు దాచేస్తా.?
అన్నట్టు, ‘కుర్చీ మడతబెట్టి’ సాంగ్ ప్రోమో అదిరింది. శ్రీలీల డాన్సుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? మహేష్‌బాబూ అదరగొట్టేశాడు.!
కాకపోతే, ఆ ‘కుర్చీ మడత బెట్టి’.. అది మాత్రం ఇబ్బంది పెడుతోంది. చాన్నాళ్ళ క్రితం ఓ యూ ట్యూబ్ ఛానల్ ఓ పనికిమాలిన ఇంటర్వ్యూ చేస్తే, అందులో పుట్టిన మాట ‘కుర్చీ మడత బెట్టి.. డాష్’ అనేది.!