Harish Shankar Old Fox.. దర్శకుడు హరీష్ శంకర్, సోషల్ మీడియా వేదికగా ఒకింత యాక్టివ్‌గానే వుంటుంటాడు. తన సినిమాల విశేషాల్ని పంచుకుంటుంటాడు.
అంతేనా, అప్పుడప్పుడూ సెటైర్లు కూడా వేస్తుంటాడు. ఎవర్నయితే టార్గెట్ చేస్తుంటాడో, వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఆ సెటైర్లు వుంటాయ్.
ఔను, తన సినిమాల కోసం పదునైన మాటలు రాసుకునే హరీష్ శంకర్, అంతే పదునైన ట్వీట్లతో, ‘కొందరికి’ కౌంటర్ ఎటాక్ ఇస్తుంటాడు.
Harish Shankar Old Fox.. ఆ ముసలి నక్క ఎవరబ్బా.?
సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది కదా.. ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది..’ అంటూ ట్వీటేశాడు హరీష్ శంకర్.

‘దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను..’ అంటూ హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాడు.
దాంతో, ఎవరా ముసలి నక్క.? అని అంతా ఆరా తీస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనా.? అన్న డౌట్ కొందరికి వస్తోంది.
మీడియా పర్సనాలిటీనా.?
ప్రెస్ మీట్లలో పనికిమాలిన ప్రశ్నలు వేసే ఓ ఎర్నలిస్టు విషయమై హరీష్ శంకర్ ఇలాంటి ట్వీటేశాడన్నది ఇంకొందరి వాదన.
ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు.? ఆ ముసలి నక్క ఎవరో చెప్పేయొచ్చు కదా హరీష్ శంకర్.? అంతే కదా మరి.! ఈ క్వశ్చన్ మార్క్ ట్వీట్లతో ప్రయోజనం ఏముంటుంది.?
Also Read: నివేదా థామస్ ‘బరువు’ సమస్య.! కానీ, ఎవరికి.?
నేరుగా ఆ వ్యక్తికే ఈ ట్వీట్ తగిలినా, ‘నన్ను కాదులే’ అని దులుపుకుపోయే వ్యక్తి అయితేనే, ‘ముసలి నక్క’ అనే నామధేయాన్ని సంపాదించుకుని వుంటాడు.
అన్నట్టు, హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విడుదలకు సిద్ధమైందీ సినిమా.

‘మిస్టర్ బచ్చన్’ సినిమా మీదనే సదరు ముసలి నక్క, తన ట్రేడ్ మార్క్ కుట్రలకు తెరలేపిందన్నది హరీష్ శంకర్ ఆవేదన అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!