Table of Contents
Jagan Sharmila YSR Legacy.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం పోయాక గొంతు లేస్తోంది.! రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికి వైఎస్ షర్మిల గొంతు సవరించుకుంటున్నారు.
ఇంతకీ, అన్నా చెల్లెళ్ళలో ఎవరు బెస్ట్.? మీడియా ముందుకొస్తే, ఎవరు బాగా ఆయా విషయాలపై మాట్లాడలుగుతారు.?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. పులివెందుల ఎమ్మెల్యే కూడా.
ఇక, వైఎస్ షర్మిల ప్రస్తుతానికి ఏపీసీసీ అధ్యక్షురాలు.! ఒకప్పుడేమో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు. అంతకు ముందు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్.
Jagan Sharmila YSR Legacy.. వైఎస్సార్ వారసత్వం ఎవరిది.?
అటు జగన్, ఇటు షర్మిల.. ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులే. ఆగండాగండీ, ఇప్పుడు ఇద్దరి మధ్యా ‘వారసత్వం’ విషయంలో ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ విజయమ్మ ఎక్కడ.? ఆమె ఎటువైపున్నారు.? ప్చ్.. ఆ ఒక్కటీ అడక్కూడదంతే.! అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న రాజకీయంలో ఆమె తలదూర్చాలనుకోవట్లేదు.
గతంలో అయితే, ఆమె వైఎస్ జగన్ వెంట నడిచారు.. అప్పట్లో షర్మిల కూడా తన అన్న జగన్ వెంటే నడిచారు. కానీ, అన్నతో విభేదించి షర్మిల బయటకు వచ్చారు.
దాంతో, వైసీపీని కాదని విజయమ్మ కూడా షర్మిల వెంట నడిచారు. తెలంగాణలో షర్మిల రాజకీయానికి మద్దతిచ్చారు విజయమ్మ.
ఇద్దరికీ ఎదురు దెబ్బ తప్పలేదు..
మొన్నటి ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ తన కుమార్తెకు మాత్రమే మద్దతిచ్చారు. ఫలితం, వైసీపీ అత్యంత దారుణంగా పరాజయం పాలైంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.
అలాగని, విజయమ్మ ఆశీస్సులు షర్మిలకు పనిచేశాయా.? అంటే, అదీ లేదు.! సరే, విజయమ్మ వ్యవహారాన్ని పక్కన పెడదాం.
అనర్గళంగా మాట్లాడటంలో వైఎస్ షర్మిలదే పైచేయి. ఈ విషయంలో వైఎస్ జగన్ చాలా వెనకబడిపోయారు. అదేంటో, అధికార పీఠమెక్కాక ఆయన మాట్లాడటమే మర్చిపోయారు. ఇప్పుడేమో అధికారం పోయినా, తిరిగి మాటలు రావట్లేదు.
జగన్ తడబడితే.. షర్మిల ఏకిపారేస్తున్నారు..
రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసే క్రమంలో జగన్ తడబడుతున్నారు.. తత్తరపాటుకు గురవుతున్నారు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే తప్ప మాట్లాడలేకపోతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ విమర్శల్ని చదివేస్తున్నారు. షర్మిల అలా కాదు, స్పాంటేనియస్గా స్పందిస్తున్నారు. ఆమెకి ఎవరూ స్క్రిప్ట్ అందించాల్సిన పనిలేదు.
Also Read: పులస పాతిక వేలు.! ఈ ‘చేప’ని తినని జన్మెందుకు.?
వైఎస్ షర్మిల అలా కాదు.. ఏకిపారేస్తున్నారు.. అదీ సొంత అన్నయ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని. మొన్నటి ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాతా.. షర్మిల ఆన్ ఫైర్.. అంతే.!
ఎలా చూసినా, వైఎస్ వారసత్వం అంటే షర్మిల మాత్రమే.. అన్న నిర్ణయానికి చాలామంది వచ్చేస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి ముగింపు పడినట్లేనా.? షర్మిల ఇకపై తన ఉనికిని చాటుకోనున్నారా.?
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! ఒక్కటి మాత్రం నిజం.. ప్రస్తతానికి జగన్ కంటే షర్మిల పవర్ఫుల్.!