Ys Jagan Waqf Politics.. అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మడం లేదే.! వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైసీపీ, ‘వ్యతిరేక ఓటు’ వేశామని చెబుతోన్న సంగతి తెలిసిందే.
కానీ, ‘అనుకూల ఓటు వేశారు’ అంటూ వైసీపీ ఎంపీల మీద దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజనం. ‘వక్ఫ్’ బోర్డు నిర్వాకంతో, ముస్లింలు సైతం నష్టపోతున్నారన్నది కేంద్రం వాదన.
ఈ క్రమంలోనే, ఆ వక్ఫ్ బోర్డు అధికారాలకు సంబంధించి, కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ‘సవరణ బిల్లు’ పెట్టింది కేంద్రం. ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకి ఆమోదం లభించింది కూడా.
Ys Jagan Waqf Politics.. వైసీపీది వ్యతిరేక ఓటు..
వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసినట్లు వైసీపీ ఎంపీలు చెబుతోంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు.

కామెడీ ఏంటంటే, వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకించే క్రమంలో, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ప్రశ్నించాల్సిన వైసీపీ ఎంపీలు, చంద్రబాబు జపంతోనే సరిపెట్టారు.
వైసీపీ ద్వంద్వ వైఖరికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గనుక, పార్లమెంటులో మండిపడితే, జగన్ కోప్పడతారేమోనన్న భయమేమో వైసీపీ ఎంపీలకి.!
గత అనుభవాలు అలాంటివి..
గల్లీలో ఒకలా, ఢిల్లీలో ఇంకొకలా.. వైసీపీ, మొదటి నుంచీ ఇదే వైఖరి అనుసరిస్తూ వస్తోంది. బీజేపీ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి.. ఆ పార్టీకి శాపంగా మారింది.
పార్లమెంటులో ఆయా బిల్లులపై ఓటింగ్, చర్చ.. సందర్భంగా, రాష్ట్రంలో వ్యతిరేక వైకరి.. ఢిల్లీలో బీజేపీ అనుకూల వైఖరి.. వైసీపీకి కొత్తేమీ కాదు.
అందుకే, ఇప్పుడీ వక్ఫ్ బిల్లు విషయంలో, రాష్ట్రంలో వ్యతిరేకిస్తూ, కేంద్రంలో అనుకూలంగా వైసీపీ వ్యవహరించిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read: షాలిని బట్టలు మార్చుకుంటుంటే గదిలోకి దూరేసిన డైరెక్టరు.!
‘లేదు, మేం వ్యతిరేంచాం’ అని ‘విప్’ని ఆధారంగా వైసీపీ చూపిస్తున్నా, ‘నిన్ను నమ్మం జగన్’ అని ఓ వర్గం తెగేసి చెబుతోంది.
సాక్ష్యాత్తూ వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చి, ‘మేం వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకించాం’ అని చెప్పినా, జనం నమ్మే పరిస్థితి లేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?