Dhoni IPL Retirement.. ఎలా వుండేవాడు, ఎలా అయిపోయాడు.? మ్యాచ్ ఫినిషర్ కాస్తా.. చేతులెత్తేస్తున్నాడు.! ఇంకెందుకు, ఐపీఎల్ ఆడటం.. జట్టుకి భారంగా మారి, అవమానాలు ఎదుర్కోవడం.?
సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్న మాటలివి. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు అభిమానుల ఆవేదన అయితే వర్ణనాతీతం.
కొందరు, మహేంద్ర సింగ్ ధోనీని బూతులు తిడుతున్నారు. ధోనీ అంటే, ఒకప్పుడు మిస్టర్ కూల్ కెప్టెన్.! టీమిండియాకి ఎన్నో విజయాల్ని అందించాడు.
వికెట్ల వెనకాల ధోనీ మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్యాట్ పట్టుకుంటే, పరుగుల వరద పారాల్సిందే. కానీ, అదంతా ఒకప్పుడు.
Dhoni IPL Retirement.. ధోనీ ఇంకెంతకాలం.?
ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని చాన్నాళ్ళే అయ్యింది. ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోక తప్పని పరిస్థితి.
నిజానికి, ధోనీ ఫర్లేదు.. ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. వేగంగానే స్టంపింగ్స్ చేయగలుగుతున్నాడు కూడా. కానీ, అది సరిపోదు, ఐపీఎల్లో. గెలిపించాల్సిన మ్యాచ్‌లలో ధోనీ చేతులెత్తేస్తున్నాడు.

అన్నట్టు, రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఏమంత బాలేదు ఐపీఎల్లో. చాలామంది స్టార్ల పరిస్థితి ఇలానే వుంది. రోహిత్ శర్మతో పోల్చితే, ధోనీ బెటర్ కదా.! ఔను, ముమ్మాటికీ బెటర్.
కానీ, అలా సరిపెట్టుకోవడానికి వీల్లేదు. రోహిత్ వ్యవహారం వేరు, ధోనీ పరిస్థితి వేరు. చివర్లో బ్యాటింగ్‌కి వచ్చి, మెరుపులు మెరిపించాల్సిన బాధ్యత ధోనీది.
ధోనీ.. రోహిత్.. ఇద్దరిదీ ఒకటే పరిస్థితి..
రోహిత్ కూడా, ఓపెనింగ్ అదరగొట్టేయాలి. రోహిత్ శర్మ ఫెయిలవుతున్నాడు. ధోనీ కూడా ఫెయిలవుతున్నాడు. కానీ, రోహిత్‌కి కాస్తో కూస్తో వయసుంది. ధోనీకి, అది లేదు. అదే అసలు సమస్య.
Also Read: నాగవంశీ.! నిజంగానే నీకు అంత దమ్ముందా.!
ఇంకా ఇంకా తిట్టించుకోవడం కంటే, ధోనీ వీలైనంత త్వరగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించేస్తే మంచిదన్న అభిప్రాయం, అతని అభిమానుల నుంచే వ్యక్తమవుతోంది.
కానీ, ధోనీ మాత్రం, ‘ఇంకా ఆ సమయం రాలేదు’ అంటున్నాడు. ఏమో, ఇంకెంతకాలం ఈ విమర్శల్ని ఆయన ఇలా ఎదుర్కొంటాడో.. వేచి చూడాలి.