Table of Contents
సినిమాల్లో తిరిగి నటించాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదంటూ సినీ నటుడు, జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించేశారు. రాజకీయాల్లో బిజీగా వుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ, ప్రజా సేవ మీద తప్ప ఇతరత్రా అంశాలపై తాను ఎలాంటి ఆలోచనలు చేయడంలేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో పవన్‌కళ్యాణ్ అభిమానులు డీలా పడ్డారు.
పవన్‌కళ్యాణ్, తిరిగి సినిమాల్లో నటించబోతున్నారనీ, నిర్మాత రామ్ తాళ్ళూరి ఓ సినిమాని పవన్‌తో నిర్మించనున్నారనీ, ఈ చిత్రానికి డాలీ (గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాల ఫేం) లేదా బాబీ (సర్దార్ గబ్బర్‌సింగ్ ఫేం) దర్శకత్వం వహించే అవకాశం వుందని ప్రచారం జరిగిన సంగతి తెల్సిందే. కానీ, పవన్‌కళ్యాణ్ ‘రెండు పడవల మీద ప్రయాణం’ చేసేందుకు సుముఖంగా లేరనే విషయం ఆయన ప్రకటన ద్వారా తేటతెల్లమయిపోయింది. ఇంకా, టుడేస్ టాప్ టిట్ బిట్స్ ఏమున్నాయో చూసేద్దామా.?
ట్యాక్సీవాలా సూపర్ రైడ్
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా రూపొందిన ‘ట్యాక్సీవాలా’ (Taxiwaala) సినిమా బంపర్ విక్టరీ కొట్టింది. సినిమా రిలీజ్‌కి ముందే లీక్ అయినా, ఆ ఇంపాక్ట్ ‘ట్యాక్సీవాలా’ వసూళ్ళపై పడకపోవడం ఆశ్చర్యకరం. అమెరికాలో 0.5 మిలియన్ డాలర్లకు చేరువయ్యింది. సోమ, మంగళవారాల్లోనూ వసూళ్ళు స్టడీగా వున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ, అమెరికాలోనూ వస్తున్న వసూళ్ళతో ‘ట్యాక్సీవాలా’ టీమ్ చాలా హ్యాపీగా కన్పిస్తోంది. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అని ‘రౌడీస్’ (విజయ్ దేవరకొండ అభిమానులు) నినదిస్తున్నారు.

chitralahari
షూటింగ్‌లో సుప్రీం హీరో బిజీ బిజీ
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ (Supreme Hero Sai Dharam Tej) తేజ తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా తర్వాత పూర్తిగా డీలాపడిపోయిన తేజు, కొంచెం తేరుకుని తన నెక్స్‌ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్ (Kalyan Priyadarsan), నివేదా పేతురాజ్ (Niveda pethuraj) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ ‘చిత్రలహరి’. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘లక్కు’ కోసం చిరంజీవి లేదా పవన్‌కళ్యాణ్ సినిమాల్లోని ఏదో ఒక సూపర్ హిట్ సాంగ్‌ని రీమిక్స్ చేయాలని తేజు అనుకుంటున్నాడట.
ఇరువురు భామల నడుమ మాస్ మహరాజ్
ఫెయిల్యూర్ గురించి పెద్దగా ఆలోచించకుండా, నెక్స్‌ట్ మూవీ మీద ఫోకస్ పెట్టడమెలాగో మాస్ రాజాకి బాగా తెలుసు. అందుకే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) పరాజయాన్ని లైట్ తీసుకున్న రవితేజ, తన తదుపరి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు. ఈ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేం నభా నటేష్ (Nabha Natesh), ‘ఆర్‌ఎక్స్100’ (RX 100) ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్లుగా నటించనున్నారు. విలక్షణ చిత్రాల దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

2 point 0
‘2.0’ హంగామా షురూ అయ్యింది
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తోన్న ‘2.0’ (2point0) సినిమా రిలీజ్‌కి రంగం సిద్ధమయ్యింది. నవంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, అప్పుడే హంగామా పీక్స్‌కి వెళ్లిపోయింది. ముందస్తు టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి హాటెస్ట్ న్యూస్ బయటకు వస్తోంది. ఫస్ట్ డే వసూళ్ళను ఇంకెవరూ ఇప్పట్లో తిరగరాసేందుకు వీల్లేని విధంగా భారీ స్థాయిలో ‘2.0’ టిక్కెట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లో అయితే ‘2.0’ సృష్టించబోయే ప్రభంజనానికి ఆకాశమే హద్దు కాబోతోందట. అదీ సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth, Akshay Kumar, Amy Jackson) పవర్ అంటే.