Ishan Kishan SRH Review.. రివ్యూ సిస్టమ్ వున్నది ఎందుకు.? వాడుకోవాలి కదా.! తొలి మ్యాచ్‌లో అదరగొట్టి, ఆ తర్వాత చతికిలపడిన యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్, అత్యంత దారుణమైన పని చేశాడు.
బంతి తన బ్యాట్‌ని తాకిందనుకుని, తనకు తానే ఔట్ ప్రకటించేసుకుని.. పెవిలియన్ బాట పట్టాడు ఇషాన్ కిషన్. అదీ, సన్ రైజర్స్ జట్టుకి సొంత గడ్డ అయిన హైద్రాబాద్‌లో.
ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ జట్టు.. ఇషాన్ కిషన్‌కి గతంలో ‘సొంత జట్టు’.! పాత టీమ్ కోసం, కొత్త టీమ్ విజయావకాశాల్ని ఇషాన్ కిషన్ దెబ్బ తీసిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఫెయిర్ ప్లే అవార్డు కోసం ఇషాన్ కిషన్ కక్కుర్తి పడ్డాడా.? బంతి తన బ్యాటుని తాకిందో లేదో తెలియనంత అమాయకుడా.? చాలా ప్రశ్నలైతే వున్నాయ్.
Ishan Kishan SRH Review.. తాకలేదు.. కానీ, పెవిలియన్‌కి పారిపోయాడు.!
రీప్లేలో బంతి, బ్యాటుని తాకలేదని తేలింది. ఒకవేళ తాకినా, రివ్యూ తీసుకుని వుండాల్సింది ఇషాన్ కిషన్. తాకకపోయినా, రివ్యూ కోరలేదు. కనీసం, అవతలి ఎండ్‌లో వున్న తన సహచరుడి సాయమూ తీసుకోలేదు.
అలా ఎలా జరిగిందసలు.? ఈ ప్రశ్న, అందరి మెదళ్ళనీ తొలిచేసింది.
నిజానికి, అంపైర్ కూడా షాక్ అయ్యాడు. వైడ్ ఇద్దామని తాను అనుకుంటే, ఇషాన్ కిషన్ మాత్రం పెవిలియన్ వైపుకి వెళ్ళిపోయాడన్న ఆశ్చర్యం అంపైర్‌లో కన్పించింది.
ప్రత్యర్థి జట్టుకి చెందిన బ్యాట్స్‌మెన్ ఔటవకపోయినా, ఔటయినట్లు సెలబ్రేట్ చేసుకుంటారు ఇలాంటి సందర్భాల్లో. చిత్రంగా, ముంబై ఆటగాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు.
ముంబై టీమ్ కూడా షాక్..
ఎందుకంటే, ముంబై ఇండియన్స్ ఆటగాళ్ళు కూడా ఇషాన్ కిషన్ తీరుతో అయోమయంలోనే వున్నారు.
బహుశా ఇలాంటి సందర్భం ఇంతకు ముందెప్పుడూ క్రికెట్‌లో జరిగి వుండదేమో.! ఔను, నిజంగానే జరిగి వుండకపోవచ్చు. పెవిలియన్‌కి వెళ్ళిపోయాక, ‘తగిలింది..’ అంటూ తనలో తానే చెప్పుకున్నాడు ఇషాన్ కిషన్.
Also Read: గిరిజనులు ఇన్నేళ్ళుగా చెప్పులెందుకు వేసుకోలేదు.?
ఒక్కమాటలో చెప్పాలంటే, ఇషాన్ కిషన్‌కి తుత్తర ఎక్కువైంది. పెవిలియన్‌కి వెళ్ళిపోవాలనే తొందరొచ్చింది. లేకపోతే, ఇంత అయోమయం ఏంటి.?
జట్టు యాజమాన్యం, ఇషాన్ కిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏమో.!