Prabhas Spirit Tripti Dimri.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘యానిమల్’ తర్వాత, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మండన్న, తృప్తి దిమ్రి.. ‘యానిమల్’ సినిమాలో ప్రధాన తారాగణం.
‘స్పిరిట్’ సినిమా కోసం తొలుత రష్మిక మండన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి అనూహ్యంగా దీపిక పదుకొనె వచ్చి చేరింది.
కానీ, దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా ఔట్ అయ్యింది. ‘క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా..’ అంటూ దీపిక తప్పుకోవడంపై క్లారిటీ వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.
Prabhas Spirit Tripti Dimri.. దూసుకొచ్చిన తృప్తి దిమ్రి..
ఇదిలా వుంటే, ‘స్పిరిట్’ కోసం నిన్న మొన్నటిదాకా మృనాల్ ఠాకూర్, రుక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే.. ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి రావడం గమనార్హం.
అయితే, అందరికీ షాక్ ఇస్తూ, తృప్తి దిమ్రి పేరుని ‘స్పిరిట్’ టీమ్ ఖరారు చేసింది. నిజానికి, రష్మిక మండన్న పేరు కంటే ముందు, ప్రచారంలోకి వచ్చిన పేరు తృప్తి దిమ్రినే.
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
కాగా, తృప్తి దిమ్రితో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయించేందుకు పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఎట్టకేలకు సందీప్ రెడ్డి వంగానే, ఆమెని తెలుగులోకి ‘స్పిరిట్’తో తీసుకొస్తున్నాడు. ‘యానిమల్’ బాలీవుడ్ సినిమా.. తెలుగులోకీ డబ్ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం.
తెలుగులో తొలి సినిమాతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అదే, ‘అర్జున్ రెడ్డి’. ఆ సినిమానే, విజయ్ దేవరకొండని రాత్రికి రాత్రి స్టార్‌ని చూసింది.
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు సందీప్ రెడ్డి వంగా. ఇన్నాళ్ళకు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ని సందీప్ రెడ్డి వంగా షురూ చేశాడు.