Sapthami Gowda Thammudu Tollywood… తెలుగు తెరపై సందడి చేయడానికి మరో కన్నడ బ్యూటీ సిద్ధమైపోయింది.
ఆల్రెడీ కన్నడ కస్తూరి రష్మిక మండన్న, తెలుగు తెరపై తిరుగులేని స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ మాటకొస్తే, ఒకరా.? ఇద్దరా.? బోల్డంతమంది కన్నడ బ్యూటీస్, తెలుగు సినిమాల్లో నటించారు, అందులో కొందరు స్టార్డమ్ కూడా సంపాదించుకున్నారు.
టాలీవుడ్లోనేనా, కన్నడ బ్యూటీస్.. బాలీవుడ్లోనూ సత్తా చాటిన సందర్భాలు బోల్డన్ని వున్నాయ్.
Sapthami Gowda Thammudu Tollywood.. ‘కాంతారా’ బ్యూటీ.. తెలుగులో..
‘కాంతారా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది సప్తమి గౌడ. ఈసారి మాత్రం డబ్బింగ్ సినిమాతో కాదు, స్ట్రెయిట్ సినిమాతోనే, టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది సప్తమి గౌడ. సప్తమి గౌడ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది.

వాస్తవానికి, ‘కాంతారా’ తర్వాత టాలీవుడ్ నుంచి ఆఫర్లు చాలానే వచ్చినా, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే, ఎక్కువ సినిమాలకు కమిట్ అవలేకపోయినట్లు చెబుతోంది సప్తమి గౌడ.
తెలుగు సినిమాల విషయంలోనే కాదు, కన్నడలోనూ కథల ఎంపికలో ఒకింత ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంటానని సప్తమి గౌడ అంటోంది.
‘తమ్ముడు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. రిలీజ్ డేట్ విషయమై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.