Table of Contents
Pawan Kalyan HHVM Power.. అబ్బే, సినిమాపై అస్సలు బజ్ లేదు. బయ్యర్లు రావడంలేదు. సినిమా విడుదలవడం కష్టం.!
ఇది, ‘హరి హర వీర మల్లు’ సినిమా రిలీజ్ నేపథ్యంలో కొద్ది నెలలగా జరిగిన ప్రచారం. ఎప్పుడైతే, సినిమా ట్రైలర్ వచ్చిందో.. సినారియో మొత్తం మారిపోయింది.
ఆంధ్రా ఏరియాలో ఇన్ని కోట్లకు అమ్మారట.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయిలో సినిమాని అమ్మేశారట.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున్న, కనిపిస్తున్న వార్తలు.
Pawan Kalyan HHVM Power.. ఇంతలోనే ఎంత మార్పు.?
నిజానికి, పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటన్నది సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ట్రేడ్ పండితులకి ఇంకా బాగా తెలుసు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సినీ వార్తలు రాసే పాత్రికేయులకీ, పవన్ కళ్యాణ్ సినిమా లెక్కలెలా వుంటాయో అనుభవమే.
వెబ్ సైట్లలో రాసే రాతలకి, అలా రాసే వ్యక్తుల అంతరాత్మకీ బోల్డంత తేడా వుంటుంది.
తప్పుడు బతుకులు.. దుష్ప్రచారాలు..
తప్పుడు రాతలు రాయాలి.. ఆ నెగెటివిటీతోనే, తమ వెబ్ సైట్లకు వ్యూయర్స్‌ని పెంచుకోవాలన్న కక్కుర్తి చాలా వెబ్ సైట్లకు వుంటుంది.
బూతులు తిట్టించుకున్నా ఫర్లేదు.. నెగెటివిటీ స్ప్రెడ్ చేయాలని కొందరు ట్విట్టర్ ఎర్నలిస్టులూ, సినీ జర్నలిస్టుల ముసుగేసుకుని.. వెకిలి లెక్కలు చెబుతున్నమాట వాస్తవం.

కానీ, వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు తెరిచి, అంతరాత్మ చెప్పినట్లే వార్తలు రాయాల్సి వస్తోంది. ఇదీ పవన్ కళ్యాణ్ సినిమా పవర్ అంటే.
సినిమా రిజల్ట్ ఎలా వుంటుంది.? అన్నది వేరే చర్చ. ప్రీ రిలీజ్ బజ్, పవన్ కళ్యాణ్ సినిమాకి లేకపోవడమా.?
నాన్సెన్స్. దుష్ప్రచారం చేసినోళ్ళంతా, ఇప్పుడు అన్నీ మూసుకుని, ‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి వాస్తవాలు చెప్పాల్సి వస్తోంది.
దటీజ్ పవన్ కళ్యాణ్.!
దాదాపు ఐదేళ్ళ కష్టం. సినిమా షూటింగ్ ప్రారంభమైంది, కోవిడ్ వల్ల ఇబ్బందులొచ్చాయి.. ఇంకో వైపు, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు.. వెరసి, సినిమా ఇంత ఆలస్యమయ్యింది.
Also Read: కాంటా లాగా షెఫాలీ జరీవాలా.! అసలేమైంది.?
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న తొలి సినిమా ‘హరి హర వీర మల్లు’. ట్రైలర్‌కి సోషల్ మీడియాలో పవర్ మేనియాని చూశాం.
థియేటర్లలో ట్రైలర్‌ని విడుదల చేస్తే, సినిమా రిలీజ్ హంగామా కనిపించింది. ఇక, సినిమా రిలీజ్‌కి హంగామా ఈ నెల 24న ఎలా వుండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!