Table of Contents
Ys Jagan Slams NCBN.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది.? అంటూ, ఊహాలోకంలో విహరిస్తున్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్, వారం వారం బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కి రావడం, ఈ క్రమంలో రాజకీయ విమర్శలు చేయడం.. పరమ రొటీన్ వ్యవహారం.
అయితే, వచ్చిన ప్రతిసారీ కామెడీ చేయడమో, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో.. ఇలాంటి చర్యల ద్వారా సోషల్ మీడియాకి ‘ట్రోల్’ కంటెంట్ ఇస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
Ys Jagan Slams NCBN. చంద్రబాబు ఎగిరిపోతారు..
మూడేళ్ళలో చంద్రబాబు ఎగిరిపోతారంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
అయినా, ఎగిరిపోవడమేంటి.? అంటే, పైకి పోవడం.. అనగా, ప్రాణాలు పోవడమా.? ఇంత దుర్మార్గం తగదు జగన్.. అంటూ, తెలుగు తమ్ముళ్ళు జగన్ మీద మండిపడుతున్నారు.
అసలు జగన్ ఉద్దేశ్యం వేరే అయి వుండొచ్చు. మూడేళ్ళలో ప్రభుత్వం కుప్పకూలిపోతే, తానే ముఖ్యమంత్రినవుతాననేది జగన్ వ్యాఖ్యల తాలూకు అర్థమేమో.
అయినాసరే.. అది తప్పే..
రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులకు హుందాతనం అవసరం. రాజకీయాల్లో రాజకీయమే చేయాలి తప్ప.. వ్యక్తుల చావుల్ని కోరుకోకూడదు.
అలాంటి అర్థం వచ్చేలా కూడా ఎవరూ మాట్లాడకూదు. అది ఏ రాజకీయ పార్టీకీ మంచిది కాదు. కానీ, రాజకీయాలు అత్యంత నీఛమైన స్థాయికి ఎప్పుడో దిగజారిపోయాయి.
ఆ కోణంలో చూస్తే, జగన్ తాజా వ్యాఖ్యలు.. అంతకు మందు చాలా సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యల కంటే మరీ అంత తీవ్రమైనవి కావేమోనని సరిపెట్టుకోవాల్సి వుంటుంది.
ఎవరు ఎగిరిపోవాలో.. ప్రజలే డిసైడ్ చేస్తారు..
అధికారంలోంచి ఎవరు ఎగిరిపోవాలో డిసైడ్ చేసేది, ఓటర్లు.. అనగా ప్రజలు. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వలేకపోతే, ఎవర్నయినా.. ముఖ్యమంత్రి పదవిలోంచి ఎగిరిపోయేలా చేస్తారు ఓటర్లు.
Also Read: ‘కుబేర’ రివ్యూ.! లక్ష కోట్లు వర్సెస్ ఓ బిచ్చగాడు.!
ఈ విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియనిదేమీ కాదు. ఎందుకంటే, వైసీపీని 2024 ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వంలోంచి ఎగరగొట్టేశారు మరి.
మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరగొని, అధికార పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నించాలేగానీ, ‘ఎగిరిపోయే’ వ్యాఖ్యలు చేయకూడదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా ఎవరు చెప్తారో ఏమో.!