Pawan Kalyan UBS Shooting.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఎప్పుడో, 2024 ఎన్నికలకు ముందే ఈ సినిమా ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్. రాశి సింగ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అన్నీ కుదిరితే, ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ వుండొచ్చు కూడా.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా, సినిమా నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్యలో హరీష్ శంకర్, రవితేజతో ఓ సినిమా పూర్తి చేసి, రిలీజ్ చేసేశాడు కూడా.
నిజానికి, తొలుత ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయ్యింది.
ఆ తర్వాత అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపంలో వేరే కథ ముందుకు నడిచింది.
Pawan Kalyan UBS Shooting.. మొదలయ్యేదెలా.? పూర్తయ్యేదెప్పుడు.?
అసలు ఈ సినిమా తిరిగి ప్రారంభమవుతుందా.? పూర్తవుతుందా.? రిలీజ్ అవుతుందా.? లేదా.? ఇలా చాలా అనుమానాలు.. బోల్డంత దుష్ప్రచారం.. ఇవన్నీ చూస్తూనే వున్నాం.
కానీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సంబంధించి తన పార్ట్ షూట్‌ని పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలో, దర్శకుడు హరీష్ శంకర్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. హరీష్ శంకర్ అంటే, కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ అభిమాని కూడా.
అభిమాని మాత్రమే కాదు.. అంతకు మించి..
పవన్ కళ్యాణ్ అభిమాని.. అనడం కంటే, పవన్ కళ్యాణ్‌ని దేవుడిలా భావించే భక్తుడు హరీష్ శంకర్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
‘ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో క్షణం తీరిక లేకున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పూర్తి చేశారు..’ అంటూ, హరీష్ శంకర్ భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు.
Also Read: తొలగిస్తే, ‘బంధం’ తెగిపోయినట్లే..నా!?
మరోపక్క, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్, పవన్ కళ్యాణ్ షూట్ పూర్తయిన దరిమిలా, ఆ ఆనందంతో ఆయనతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.