Table of Contents
AP Assembly Minus YSRCP.. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు.. వీటి ప్రస్తావన లేకుండా, చట్ట సభలు.. వాటి నిర్వహణ.. గురించి మాట్లాడలేం కదా.!
ఏది ఏమైనా, రాజకీయాలు ఎలా వున్నా.. ప్రజా ప్రతినిథులు ఖచ్చితంగా చట్ట సభలకు వెళ్ళి తీరాలి.
ఔను, ఓ నియోజక వర్గం నుంచి ఓ వ్యక్తి ఎమ్మెల్యేగా.. అంటే, శాసన సభ్యుడిగా గెలిచాక, అసెంబ్లీకి వెళ్ళి తీరాలి.
అసెంబ్లీలోనే, తన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి.
కానీ, వైసీపీ ఏం చేస్తోంది.? ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే, అసెంబ్లీకి వస్తాం’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెగేసి చెప్తున్నారు. దాంతో, అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ లేకుండానే జరుగుతున్నాయి.
AP Assembly Minus YSRCP.. జగన్ మెట్టు దిగినట్టేనా..?
గతంతో పోల్చితే, వైఎస్ జగన్ కాస్త మెట్టు దిగినట్లే కనిపిస్తోంది. ‘అసెంబ్లీకి వెళ్ళి, అక్కడ మాట్లాడేందుకు తగినంత సమయం లేకపోతే ఏం చేస్తాం.?’ అంటూ తాజాగా వ్యాఖ్యానించారు జగన్.
‘మీరు వెళ్ళండి.. మన వాళ్ళకి మీరే అసెంబ్లీలో నాయకత్వం వహించండి..’ అంటూ వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వైఎస్ జగన్ సూచించారట.
నిజమేనా.? జగన్ అలా అని వుంటారా.? నిజానికి, అలా అనే ఛాన్స్ వుండదు. ఒకవేళ జగన్, అలా అని వుంటే, ఆయనలో చిన్నపాటి మార్పు వచ్చినట్లే.
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ప్రజా సమస్యలపై గొంతు వినిపించేందుకు తగిన సమయం స్పీకర్ ఇస్తే, అసెంబ్లీకి వెళదాం.. అని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో జగన్ అన్నారట.
వెళితే కదా.. తెలిసేది.?
అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళాలి.. పులివెందుల ఎమ్మెల్యేగా అది జగన్ బాధ్యత. వెళ్ళాక కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలిసేది.?
ఒకవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగినంత సమయం మాట్లాడేందుకు దొరక్కపోతే, అప్పుడు సభలోనే నిరసన తెలిపే అవకాశం వైసీపీ శాసన సభ్యులకు దొరుకుతుంది.
మీడియా పాయింట్ దగ్గర కూడా ఈ విషయాన్ని లేవనెత్తొచ్చు. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం వుంటుంది.. అక్కడేం జరుగుతుందో ప్రజలకూ అర్థమవుతుంది.
అంతేగానీ, అక్కడ తనకు అవకాశం దక్కదని భయపడుతూ వైఎస్ జగన్, ఇంట్లోనే కూర్చుంటే ఎలా.? పైగా, బెంగళూరులో జగన్ మకాం వేయడం సబబేనా.?
గెలిపించిన ప్రజలకే మొహం చూపించుకోలేని జగన్..
జగన్, తన నియోజకవర్గ ప్రజలకు మొహం చూపించలేరు. చూపించరు. కానీ, మిగతా వైసీపీ శాసన సభ్యుల పరిస్థితి అది కాదు కదా.!
అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ.. ఈ మూడు పార్టీలే కనిపిస్తున్నాయి. మూడూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఆ మూడు పార్టీలకు ఎదురుగా వైసీపీ అసెంబ్లీలో నిలబడి వుండాల్సింది.
ప్చ్.. దురదృష్టవశాత్తూ, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా పారిపోతోంది వైసీపీ. అసెంబ్లీకి వెళ్ళని వైసీపీ,
అసలు రాజకీయాల్లో వుండటానికే అర్హత కోల్పోతోందని వైసీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.
ఆనాటి పాపం వెంటాడుతోంది..
అధికారంలో వున్నప్పుడు వైఎస్ జగన్, అసెంబ్లీ సాక్షిగా విర్రవీగిన వైనం.. అందరికీ తెలిసిందే. అందుకే, 151 నుంచి 11కి పడిపోయింది వైసీపీ.
అసెంబ్లీకి వెళితే, తన పతనావస్థ ఏంటో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అప్పట్లో చేసిన పాపాలు వెంటాడతాయి.
Also Read: ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్.! ఎప్పుడెలా ముంచుకొస్తుందో.!
తమ శాసన సభ్యులతో, టీడీపీ అలాగే జనసేన పార్టీలను జగన్ తిట్టించారు అప్పట్లో. అలాంటి తిట్లు, తాను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నది జగన్ భయం.
తిట్టాలనుకుంటే, జగన్ లేకున్నా అసెంబ్లీలో టీడీపీ, జనసేన శాసన సభ్యులు జగన్‌ని తిట్టొచ్చు. కానీ, తిట్టడంలేదు. భయం వీడి, జగన్ అసెంబ్లీకి వెళ్ళడం మంచిది.
