The Paradise SHIKANJA MAALIK Sudigali.. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘దసరా’ సినిమాని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి నాని కోసం ‘అంతకు మించిన’ డిఫరెంట్ స్టోరీ సిద్ధం చేశాడు.
అదే, ‘ది ప్యారడైజ్’.! ఈ సినిమా కోసం గతంలోనే విడుదల చేసిన గ్లింప్స్ ఏ స్థాయి సంచలనాలకు కేంద్ర బిందువయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
నాని గెటప్, నాని బాడీ లాంగ్వేజ్.. ఇలా ఒకటేమిటి.? హీరో పాత్రకి సంబంధించి చాలా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
The Paradise SHIKANJA MAALIK Sudigali.. సుడిగాలి షికంజా మాలిక్..
‘ది ప్యారడైజ్’ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు సీనియర్ నటుడు మోహన్‌బాబు. తాజాగా, మోహన్‌బాబుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ లుక్‌ని రివీల్ చేశారు.
షికంజా మాలిక్ పాత్రలో మోహన్‌బాబు ‘ది ప్యారడైజ్’ సినిమాలో విలనిజం పండించనున్నారు. రెగ్యులర్ విలనిజంకి భిన్నంగా, ఇందులో విలనిజం వుండబోతోందిట.
కాగా, షికంజా మాలిక్ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ అవగానే, చాలామందికి ‘సుడిగాలి’ పాత్ర గుర్తుకు వచ్చింది.
కొదమ సింహం సుడిగాలి..
చాలాకాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘కొదమ సింహం’ సినిమాలో ‘సుడిగాలి’ పాత్ర పోషించారు మోహన్‌బాబు.
ఇప్పుడీ ‘షికంజా మాలిక్’ పాత్ర చూస్తే, ఆనాటి ‘కొదమ సింహం’ సినిమాలోని సుడిగాలి పాత్ర, చాలామందికి గుర్తుకొచ్చింది. అందుకే, సుడిగాలి షికంజా మాలిక్ మోహన్‌బాబు.. అంటూ జనం కామెంట్లేస్తున్నారు.
ఈ మధ్య సీనియర్ హీరోలు, విలనిజం చూపించడం చూస్తున్నాం. అక్కినేని నాగార్జున ‘కూలీ’ సినిమా కోసం విలన్‌గా మారిన సంగతి తెలిసిందే.
Also Read : బిగ్ బాస్ ఇంట్లో ‘ఫుడ్డు’ కోసం కొట్టుకు ఛస్తారెందుకు.?
అయితే, మోహన్‌బాబుకి విలనిజం కొత్త కాదు. కెరీర్ మొదట్లో ఎక్కువగా విలనిజం పండించారు మోహన్‌బాబు వెండితెరపై.
ఇప్పుడు మళ్ళీ విలనిజంపై మోహన్‌బాబు ఫోకస్ పెట్టినట్లున్నారు. అయితే, షర్ట్‌లెస్ మోహన్‌బాబుని స్క్రీన్ మీద భరించగలమా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
