Liquor Politics Irresponsible Politicians.. మద్యం.. రాజకీయం.! ఈ రెండిటినీ విడదీయలేం. కొత్త సీసాలో పాత సారా.. అనే డైలాగ్ తరచూ వింటుంటాం. అది నిజం.!
లిక్కర్ చుట్టూ రాజకీయ ఆరోపణలు చూస్తే, ‘కొత్త సీసాలో పాత సారా’ అన్న సామెత గుర్తుకొస్తుంటుంది. ఎందుకంటే, ఆ రాజకీయ విమర్శలు అలానే వుంటాయి.
అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అంతే తేడా.! ఆరోపణలు సేమ్. లిక్కర్ మాఫియా.. అన్ని రాజకీయ పార్టీల్నీ శాసిస్తోంది.
అసలు, రాజకీయ నాయకుల్లేకుండా లిక్కర్ వ్యాపారం ఎక్కడైనా జరుగుతుందా.? రాజకీయ నాయకులే, లిక్కర్ మాఫియాకి మూల స్తంభాలు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు.
నాణ్యమైన మద్యాన్ని విక్రయించినా, కోట్లు వెనకేసుకోవచ్చు. అదే కల్తీ మద్యాన్ని విక్రయిస్తేనో.. అంతకు మించి.! అందుకే, కల్తీ మద్యంపై కక్కుర్తి ఎక్కువ.. సారా వ్యాపారులకి.
Liquor Politics Irresponsible Politicians.. ఆరోగ్యానికి హానికరమైనా.. అదే ప్రధాన ఆదాయ మార్గం.!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అని చెబుతుంటాం. ప్రభుత్వం అదే చెబుతుంటుంది. సినిమా థియేటర్లలోనూ ఈ మేరకు ప్రకటనలు చూస్తుంటాం.
టీవీ కమర్షియల్స్, మద్యం ఉత్పత్తులకి ప్రచారం చేయకూడదన్న నిబంధన కూడా వుంది.అందుకే, ఆయా మద్యం బ్రాండ్లకు సంబంధించిన మంచి నీటి బాటిళ్ళకు ప్రమోట్ చేస్తుంటారు ప్రముఖులు.
లిక్కర్ మాఫియా.. పాత సీసాలో, కొత్త సారా.. ఈ ప్రకటనలకూ వర్తిస్తుంది. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే ‘మ్యాన్షన్ హౌస్’ వాటర్‌కి ప్రచార కర్త.
మ్యాన్షన్ హౌస్ అంటే, లిక్కర్.. అని చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేకి వున్న సామాజిక బాధ్యత ఇలా తగలడింది.
లిక్కర్ మాఫియా.. రాజకీయ నాయకుల డిస్టిలరీలు..
ఇక, లిక్కర్ మాఫియా విషయానికే వచ్చేద్దాం. రాజకీయ నాయకులే డిస్టిలరీలు నడుపుతారు. సాధారణంగా అధికార పార్టీ కనుసన్నల్లోనే వుంటాయివి.
చిత్ర విచిత్రమైన బ్రాండ్లతో లిక్కర్‌ని విక్రయించడం వైసీపీ హయాంలో మొదలైంది. ఇప్పుడది కాస్త తగ్గింది. కానీ, లిక్కర్ మాఫియా.. అప్పుడూ, ఇప్పుడూ అంతే.
Also Read: పవన్ కళ్యాణ్‌కి ‘తమిళ షాక్’.! ఇది తెగులు పైత్యం.!
లిక్కర్ వ్యాపారులు అప్పుడు ఓ పార్టీలో వుంటే, ఇప్పుడు ఇంకో పార్టీలోకి దూకుతారు. అధికారం అనే రక్షణ వాళ్ళకి కావాలి మరి.!
ప్రజారోగ్యం సర్వనాశనమవడానికి లిక్కర్ ప్రధాన కారణం. మరి, ప్రభుత్వాలెందుకు లిక్కర్‌ని బ్యాన్ చెయ్యవు.? ఎందుకంటే, లిక్కర్ అంటే వేల కోట్ల వ్యాపారం.. లక్షల కోట్ల వ్యాపారం.!
