Rashmika Mandanna Thamma.. సాధారణంగా పండక్కి సినిమాలొస్తుంటాయ్. కానీ, పండగ అయిపోయాక, సినిమా రావడమేంటో.!
రష్మిక మండన్న తాజా చిత్రం ‘థామా’, నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీపావళి మరుసటి రోజు, అంత కరెక్ట్‌గా ఎలా ప్లాన్ చేశారో ఏమో.!
అది కూడా, మంగళవారం సినిమా రిలీజ్. చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఓపెనింగ్స్ గురించి మర్చిపోవచ్చు.
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మండన్న, సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా ప్రమోషన్స్ గట్టిగానే చేశారు.
Rashmika Mandanna Thamma.. హర్రర్ కామెడీ..
ఇదొక థ్రిల్లర్. పైగా, హర్రర్ కంటెంట్. కామెడీ ఎలాగూ వుంటుందనుకోండి.. అది వేరే విషయం. అయితే, ప్రోమోస్ మరీ అంత ఇంట్రెస్ట్ ఏమీ క్రియేట్ చేయలేకపోయాయ్ సినిమా మీద.
హిందీ సినిమానే, తెలుగులోకి డబ్ చేస్తున్నారంతే. హిందీలో కొన్ని హర్రర్ సినిమాలు ఈ మధ్యకాలంలో హిట్టయ్యాయి. చాలావరకు తేలిపోయాయి కూడా.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినీ పరిశ్రమల్లోనూ హర్రర్ కంటెంట్ మీద ఆసక్తి పెరుగుతూ వస్తోంది. సినీ జనాలూ అదే కంటెంట్‌ని ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు.
Also Read: Pawan Kalyan’s Next With Star Director.?
ఈ లిస్టులో ‘థామా’ కూడా చేరిపోయింది. అయినా, కొత్తగా ‘థామా’లో ఏముంటుంది.? అది తెలియాలంటే, సినిమా చూాడాల్సిందే.!
కానీ, రిలీజ్‌కి ముందు మినిమమ్ బజ్ కూడా ‘థామా’ మీద లేదే.! తెలుగులో అయితే, పూర్తిగా రష్మిక మండన్న మీదనే టిక్కెట్లు తెగాలి. తెగుతాయా మరి.?
