Pawan Warning Against Jagan.. ఇంకా సోషల్ మీడియా వేదికగా అదే పైత్యం.! అభివృద్ధికి విఘాతం కలిగించేలా దుష్ప్రచారం.! వైసీపీ పెంచి పోషిస్తున్న పేటీఎం కూలీల తీరు ఇదీ.!
2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైపోయినా, వైసీపీ పెంచి పోషిస్తున్న నీలి కూలీల తీరు మారలేదన్నది కూటమి పార్టీల అభిప్రాయం.!
కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టినా, వెంటనే దుష్ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో, కూటమి పార్టీల నుంచి కౌంటర్ ఎటాక్ కూడా తప్పడంలేదు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే, దానిపైనా వైసీపీ దుష్ప్రచారం ప్రారంభించింది.
Pawan Warning Against Jagan.. జైలుకు పంపుతారా.? గీత దాటొద్దు..
అంతే కాదు, ప్రైవేటు వ్యక్తులు గనుక, పీపీపీ విధానంలోకి వస్తే, వారిని జైలుకు పంపుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించడంతో, కూటమి నుంచి కౌంటర్ ఎటాక్ తీవ్రస్థాయిలో రావాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాజాగా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, ఇంకాస్త గట్టిగా వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.
రౌడీయిజం, గూండాయిజం చేస్తామంటే కుదరదు.. బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదు.. మక్కెలిరగదీసి, మూలన కూర్చోబెడతాం.. అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్‌కి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే, వైసీపీ నుంచి జరుగుతున్న దుష్ప్రచారం అలాంటిది మరి.!
మెడికల్ కాలేజీలకు సంబంధించిన పీపీపీ విధానంపై, కేంద్రం నియమించిన పార్లమెంటరీ కమిటీలో, వైసీపీ ఎంపీ కూడా సభ్యుడిగా వున్నారాయె.
ఆరోగ్యశ్రీ సంగతేంటి.?
అసలంటూ, ఆరోగ్యశ్రీ నడుస్తున్నదే పీపీపీ విధానం.. అలాంటప్పుడు, మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం తప్పెలా అవుతుంది.?
ప్రభుత్వంతో కలిసి పని చేసే కాంట్రాక్టర్లను, పారిశ్రామికవేత్తల్ని ‘జైల్లో పెడతాం’ అని ఎవరు హెచ్చరించినా, అది అభివృద్ధికి విఘాతం కలిగించే అంశమే.
అయినా, బెయిల్ రద్దయిన మరుక్షణం జైల్లో వుండే జగన్, ఇలా బెదిరింపులకు దిగడమేంటి.? అన్నది అంతటా వినిపిస్తున్న వాదన.!
ఓ రాజకీయ నాయకుడిగా, ఓ ప్రజా ప్రతినిథిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్.. రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు.!
కానీ, గీత దాటితే.? చేతి గీతలు చెరిపేస్తాం.. అని పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్.. వైరల్ అవుతోంది.
