బుల్లి తెర సంచలనం బిగ్ బాస్ రియాల్టీ షో.. (Bigg Boss 3 Telugu Elimination) వారం అంతా ఒక లెక్క.. వారాంతం ఇంకో లెక్క.. అన్నట్లుంటుంది హంగామా. ఎందుకంటే, వారాంతంలోనే హోస్ట్ కనిపిస్తాడు.. స్వీట్ అండ్ హాట్ షాక్స్ ఇస్తుంటాడు. కింగ్ నాగార్జున ఈ వీకెండ్ షో లో ఎలాంటి సందడి చేయబోతున్నాడు.. ఎవర్ని ఇంటికి పంపించబోతున్నాడు.? ఎవరికి తీపి కబురు చెప్పబోతున్నాడు.? చేదు కబురు.. అదే ఎలిమినేషన్ వుంటుందా? లేదా?
బుల్లితెరపై గత వారం రోజులుగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకి (Bigg Boss Season 3 Telugu) సంబంధించి, బిగ్‌హౌస్‌లో ఫస్ట్ ఎలిమినేషన్‌కి రంగం సిద్ధమైంది. ఈ సారి ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియ గతంతో పోల్చితే పూర్తిగా భిన్నం. హాట్ స్టార్ యాప్‌లోంచి మాత్రమే ఈ ఓటింగ్ జరుగుతోంది.
హాట్ స్టార్లోకి (Hot Star) వెళ్లి ఓటు వేేయడమనే పద్ధతి గతంతో పోల్చితే కొంచెం కష్టమైన ప్రక్రియే. అందరికీ సులువుగా అర్ధమయ్యే ప్రక్రియ కాదిది. ఇక మొబైల్ నుండి మిస్స్డ్ కాల్ ఇవ్వడమనే ఇంకో ప్రక్రియ కూడా ఉందనుకోండి. అది వేరే సంగతి.
ఏది ఏమైనా ఈ సారి బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం చాలా కన్ఫ్యూజన్తో కూడుకున్నది అనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ వ్యవహారంపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలతో ఫార్మాట్ మార్చాలనే ఆలోచనతో నిర్వాహకులు వున్నారంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
ఆ సంగతి పక్కన పెడితే, ఈ సారి హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా చాలా స్టాంగ్‌గా ఉన్నారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఆర్మీలు సిద్ధం చేసుకున్నారు. దాంతో పోటీ అంచనాల్ని మించి వుండబోతోందని నిస్సందేహంగా చెప్పవచ్చు. గత సీజన్లో ‘కౌషల్ ఆర్మీ’ (Kaushal Army) మాత్రమే సంచలనం సృష్టించింది. ఈ సారి అలా కాదు, 15 మంది కంటెస్టెంట్స్కీ సెపరేట్‌గా ఆర్మీస్ ఉన్నాయి. ఆ ఆర్మీలు అన్నీ బీభత్సంగా వర్క్ చేయడం స్టార్ట్ చేసేశాయి.
తొలి ఎలిమినేషన్లో (Bigg Boss 3 Telugu Elimination) భాగంగా ఆరుగురు ఇంటి సభ్యులు లిస్టులో ఉన్నారు. పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam), సీనియర్ నటి హేమ (Hema), టీవీ9 జాఫర్ (Jaffar), హీరోయిన్ వితికా షెరు (Vithika Sheru, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), బుల్లితెర నటి హిమజ (Himaja).
తొలివారం హౌస్‌లో (Bigg Boss Season 3 Telugu)ఎవరి వికెట్ పడిపోతుందనే అంశంపై ఆసక్తిగా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో ఒకరు హౌస్ (Bigg House)నుండి బయటికి వెళ్లక తప్పదేమో.
అయితే, పలానా కంటెస్ట్ంట్కి ఎడ్జ్ ఉంది అని మాత్రం ఖచ్చితంగా వీక్షకులు ఊహించలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఈ వారం అసలు ఎలిమినేషనే ఉండదనే టాక్ కూడా వినిపిస్తోంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎలిమినేషన్‌పై (Bigg Boss 3 Telugu Elimination) తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో సడెన్‌గా ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి, ప్రేక్షకుల్నీ, హౌస్ మేట్స్నీ టెన్షన్ ఫ్రీ చేసింది బిగ్‌బాస్ టీమ్. ఇక తాజా ఎలిమినేషన్ టెన్షన్‌కి తెర పడాలంటే ఆదివారం రాత్రి వరకూ ఆగాల్సిందే.
ఎందుకంటే శనివారం స్టార్ట్ అయిన ఎలిమినేషన్ (Bigg Boss 3 Telugu Elimination) ప్రక్రియ ఆదివారంతో ముగుస్తుంది. శనివారం కొందరు సేఫ్ జోన్లోకి వెళ్లి రిలాక్స్ అవుతారు. చివరి ఉత్కంఠకు తెర పడేది మాత్రం ఆదివారమే. చూడాలి మరి హౌస్‌లో పడిపోయే ఫస్ట్ వికెట్ ఎవరిదవుతుందో. అసలు వికెట్ అనేది తొలి వారం పడుతుందో లేదో.