Saamaanla Sivaji Dirty Mouth.. నటుడిగా కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో, అనూహ్యంగా బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో శివాజీ ‘లైఫ్’ ఇచ్చింది.!
నిజానికి, నటుడిగా పలు విజయవంతమైన సినిమాలతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ.! రాజకీయాల్లో అయితే, ‘గరుడు పురాణం శివాజీ’గా సుపరిచితుడే.!
ఇకపై, ‘సామాన్ల శివాజీ’ అని పిలవాలేమో.! ఔను, మహిళల శరీర భాగాల్ని ‘సామాన్లు’ అంటూ అభివర్ణించి, వివాదాల్లో ఇరుక్కున్నాడు నటుడు శివాజీ.
వివాదం ముదిరి పాకాన పడ్డంతో, సామాన్ల శివాజీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదంతా, ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నోరు జారిన ఫలితమే.!
సినిమా ప్రమోషన్ అంటే, వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలేమో.. అని కొందరు సినీ జనాలు, సినీ ఎర్నలిస్టులు అనుకుంటున్నారు.
నటీనటులపై అసభ్యకరమైన ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు కొందరు సినీ ఎర్నలిస్టులు. సినీ నటులు, పక్కాగా ప్లాన్ చేసుకుని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
బహుశా శివాజీ కూడా, సామాన్ల స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకుని వచ్చినట్లున్నాడు. హీరోయిన్లకు, వేదిక పైనుంచి ఓ బోడి సలహా ఇచ్చేశాడు.. సామాన్లు దాచుకోమని.!
అందంగా చీర కట్టుకుంటే గౌరవం పెరుగుతుందనీ, సామాన్లు చూపిస్తే పరువు పోతుందనీ శివాజీ వ్యాఖ్యానించాడు.
చీర కట్టుకుంటే గౌరవం పెరుగుతుందా.? ఏమో, పెద్ద ‘ముండావాడు’ చెప్పాడు కాబట్టి, ఫర్లేదనుకోవచ్చు. కానీ, ‘సామాన్లు’ చూపించడమేంటి.?
పైగా, ‘దరిద్రపు ముండలు’ అంటూ, శివాజీ అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు, పలువురు మహిళలు ఆ వేదిక మీద వుండగానే.!
నోటి దూల శివాజీకి కొత్తేమీ కాదు.! కాకపోతే, ఈసారి అది అన్ని హద్దుల్నీ దాటేసింది. మానవ శరీరం అత్యంత సంక్లిష్టమైనదీ.. చాలా చాలా ప్రత్యేకమైనది.
ప్రతి శరీర భాగానికీ ఓ ప్రత్యేకత వుంటుంది. ఏదీ, అనవసరమైనది కాదు. మహిళ శరీరం, ఇంకా ప్రత్యేకమైనది, గౌరవ ప్రదమైనది.!
ఏ సామాన్ల గురించి శివాజీ మాట్లాడాడో, ఆ సామాన్లలో జననాంగం వుంటుంది.. పుట్టిన బిడ్డకు కనీసం ఆర్నెళ్ళ వరకు కడుపు నింపే పాలను అందించే, వక్షోజాలూ వుంటాయి.
శివాజీకి కూడా పిల్లలు వుండే వుంటారు. సో, అతనికి అన్నీ తెలిసే వుంటాయి. ఓ తల్లికే శివాజీ పుట్టి వుంటాడు కదా.. మెషీన్ అయితే కాదు కదా.!
మరి, స్త్రీ శరీర భాగాల్ని సామాన్లని ఎలా అనగలిగాడు.? ఎందుకంటే, అది మదం.. ఉన్మాదం.! యావత్ మహిళా సమాజం, కాండ్రించి సామాన్ల శివాజీ మొహాన ఉమ్మేస్తోంది.
సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెబితే, చేసిన పాపం పోతుందా.? ఛాన్సే లేదు.! ఇలాంటోళ్ళకి సమాజంలో చోటుండకూడదు.
