AR Rahman Controversy.. భారతీయ సినీ సంగీతానికి అంతర్గాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఎ.ఆర్.రెహమాన్.. అనూహ్యంగా, వివాదంలోకెక్కాడిప్పడు.!
సంగీతానికీ, మతానికీ లింకు పెట్టి అందర్నీ షాక్‌కి గురిచేశాడు రెహ్మాన్. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి తన మతమే కారణమన్నది రెహ్మాన్ చేసిన వ్యాఖ్యల సారాంశం.
పూర్తి స్పృహతోనే ఓ ఇంటర్వ్యూలో రెహ్మాన్, మత ప్రస్తావన తీసుకొచ్చి, వివాదాన్ని రాజేశాడు.
రెహ్మాన్ గతం ఏంటి.? అతని అసలు పేరేంటి.? పుట్టుకతో అతని మతమేంటి.? ఆ తర్వాత మారిన మతమేంటి.? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెరపైకొస్తున్నాయి.
వివాదం ముదిరి పాకాన పడ్డాక, ‘నేను భారతీయుడిగా గర్వపడుతున్నాను.. ఓ మతానికి నేను పరిమితం కాలేదు. నా సంగీతాన్ని ఏ మతానికీ పరిమితం చేయలేదు..’ అంటూ ఓ వివరణ ఇచ్చాడు రెహ్మాన్.
ఇది సోషల్ మీడియా యుగం. ఇంటర్వ్యూల్లో ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒకటికి వందసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ మాట్లాడాలి.!
ఆ విషయం తెలియనంత అమాయకుడైతే కాదు రెహ్మాన్. ప్రస్తుతం తెలుగులో ‘పెద్ది’ సినిమాకి రెహ్మాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
రెహ్మాన్ తాజాగా సృష్టించిన వివాదం నేపథ్యంలో, అతను సంగీతం అందిస్తున్న సినిమాలపైనా ట్రోలింగ్ జరుగుతోంది.
ఇకపై రెహ్మాన్‌కి ఎవరూ అవకాశాలు ఇవ్వకూడదన్న డిమాండ్లు తెరపైకొస్తుండడం గమనార్హం. కొత్తగా రెహ్మాన్ పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ, కక్కుర్తి పడ్డాడు.
కక్కుర్తి అనాలా.? మూర్ఖత్వం అనాలా.? ఏదన్నా అనుకోండి, రెహ్మాన్ తన స్థాయిని అదఃపాతాళానికి పారేసుకున్నాడిప్పుడు.!
ఫలానా మతానికి చెందిన వాడిని కావడం వల్లే, తనకు అవకాశాలు తగ్గిపోయాయని రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
క్షమాపణతో సమసిపోయే వివాదం కాదు. నరనరానా జీర్ణించుకుపోయిన మూర్ఖత్వం వల్లనే రెహ్మాన్ ఈ స్థాయికి దిగజారిపోయాడన్నది నిర్వివాదాంశం.
అయినా, ‘మా తుజే సలామ్..’ అంటూ అత్యద్భుతమైన దేశ భక్తి పాటకు స్వరాల్ని సమకూర్చిన రెహ్మాన్, ఇలా మతం ముసుగులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అత్యంత అభ్యంతకరం.
అల్లా రఖా రెహ్మాన్ అసలు పేరు దిలీప్ కుమార్.! సంప్రదాయ హిందూ కుటుంబంలో దిలీప్ కుమార్‌గా జన్మించిన రెహ్మాన్, తండ్రి తర్వాత ఇస్లాంలోకి మారాడు.
