MEGA Compound Special Focus.. మెగా కాంపౌండ్ మీద చాలా కాలం క్రితం ఓ వర్గం మొదలు పెట్టిన ‘మెగా పీఆర్ – మెగా మాఫియా’ అనే దుష్ప్రచారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.
ప్రతి సినిమాకీ ‘మెగా మాఫియా – మెగా పీఆర్ స్టంట్స్’ అంటూ, మెగా హీరోలకు సంబంధించిన సినిమాల్ని ట్రోల్ చేయడం చూస్తూనే వున్నాం.
అయితే, మెగా సినిమాలకు సంబంధించి రిలీజ్ టెన్షన్లు సహా.. ఇతరత్రా సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ‘మెగా మాఫియా’ అనేదే నిజమైతే, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి సమస్యలెందుకొస్తాయ్.?
‘ఆచార్య’, ‘భోళా శంకర్’ సినిమాలు సరైన పీఆర్ లేక దాారుణంగా దెబ్బ తిన్నాయ్. మారిన పరిస్థితులకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ ఎంపిక వంటి విషయాల్లో మెగా కాంపౌండ్ అప్డేట్ కాలేకపోతోంది.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకొచ్చేసరికి, మెగాభిమానులు.. ఓ వైపు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే, ఇంకో వైపు ‘సమస్యలు’ ఎదుర్కొన్నారు.. మానసిక క్షోభకి గురయ్యారు.
MEGA Compound Special Focus.. ఓజీ నుంచి మన శంకర వర ప్రసాద్ వరకూ..
‘ఓజీ’ విషయంలో అయినా, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విషయంలో అయినా, మెగాభిమానులకు థియేటర్ల నుంచి వచ్చిన సమస్య అంతా ఇంతా కాదు.
చివరి నిమిషం వరకూ, ప్రీమియర్స్ విషయంలో సందిగ్ధం ‘ఓజీ’ సమయంలో, మెగాభిమానుల్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన సంగతి తెలిసిందే.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకి అయితే, హిట్ టాక్ వచ్చిన తర్వాత, ఇతర సంక్రాంతి రిలీజ్‌ల కారణంగా సరైన థియేటర్లు మిగలని దుస్థితి ఏర్పడింది.
ఎక్కడికక్కడ స్థానికంగా థియేటర్ల యజమానులు, కొందరు డిస్ట్రిబ్యూటర్లు కొంతమేర థియేటర్లను సర్దుబాటు చేశారు.
వాళ్ళ నుంచే వినిపిస్తున్న వాదన ఏంటంటే, ‘మెగా కాంపౌండ్‌కి థియేటర్ల ఛెయిన్ వుండాలి.. సరైన డిస్ట్రిబ్యూషన్ యూనిట్‌ని కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి’ అని.
నిజానికి, మెగా కాంపౌండ్ నుంచి సొంత బ్యానర్లకు ఇబ్బందేమీ లేదు. నాగబాబు నేతృత్వంలోని అంజనా ప్రొడక్షన్స్ వుండనే వుంది. కానీ, ఆ బ్యానర్ నుంచి సినిమాలు రావట్లేదు.
మరోపక్క, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా ఓ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. దాన్నుంచీ సినిమాలు దాదాపుగా ఆగిపోయాయి.
ఇంకోపక్క నిహారిక, సుస్మిత మాత్రం సొంత బ్యానర్లు పెట్టి సక్సెస్ అయ్యారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ని యాక్టివేట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు కావాల్సిందల్లా, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు సరిగ్గా చూసుకోవడం. అలానే, సొంతంగా థియేటర్ల ఛెయిన్ కలిగి వుండడంపైనా మెగా కాంపౌండ్ దృష్టి పెట్టాల్సి వుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా, పీఆర్ టీమ్ అనేది సరిగ్గా పని చేయాల్సి వుంది మెగా కాంపౌండ్ కోసం. అభిమానులు ఈ విషయమై తీవ్ర అసంతృప్తితో వున్నారు.
పెయిడ్ నెగెటివిటీని ఎదుర్కొనాలంటే, సరైన పీఆర్ టీమ్ అనేది తప్పనిసరి.! మెగా కాంపౌండ్‌కి సంక్రాంతి నేర్పిన పాఠం ఆషామాషీగా లేదు.
‘మన శంకర వర ప్రసాద్’ పెద్ద హిట్ అయినా, అంతకు మించి వసూళ్ళను సాధించి వుండేది, పైన చెప్పుకున్న మూడు విభాగాల్లో గనుక బలంగా వుండి వుండగలిగితే.!
రామ్ చరణ్ నుంచి ‘పెద్ది’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలూ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
సో.. మెగా కాంపౌండ్ బీ అలర్ట్.!
