Mouni Roy Gets Shock.. మొన్న నిధి అగర్వాల్ విషయంలో పెద్ద రచ్చ జరిగింది.
ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి వెళ్ళిన నిధి మీద కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన అసభ్యకరమైన తీరు.. కొత్త వివాదాలకు తావిచ్చింది.
మహిళల వస్త్రధారణపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించడం తెలిసిన విషయమే. నిధి అగర్వాల్ ఘటనపై స్పందించే క్రమంలో శివాజీ నోరు జారాడు.
దాంతో, సోషల్ మీడియా వేదికగా, ‘మా శరీరం మాది.. మీది కాదు..’ అంటూ అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్స్, వివాదాన్ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాయి.
Mouni Roy Gets Shock.. సమస్య వేరు.. రచ్చ వేరు..
అసలు సమస్య వేరు.. జరుగుతున్న రచ్చ వేరు. జన సమూహాల్లోకి మహిళా సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు, అక్కడ అత్యంత జుగుప్సాకరమైన ప్రవర్తనతో విరుచుకుపడుతున్నారు కొందరు.
పర్వర్టెడ్ మైండ్ సెట్ వున్న ఆ కొందరి కారణంగా, చాలా సందర్భాల్లో చాలామంది సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తగినంత భద్రతను కల్పించడంలో నిర్వాహకులు విఫలమవుతుండడం కూడా, ఆకతాయిల జుగుప్సాకరమైన చేష్టలకు ఆస్కారం కల్పిస్తోంది.
తాజాగా, ఓ ఈవెంట్లో డాన్స్ చేస్తున్న సినీ నటి మౌనీ రాయ్‌పై కొందరు అసభ్యకరంగా విరుచుకుపడ్డారు. వృద్ధ వయసులో వున్న వ్యక్తులు తనను జుగుప్సాకరంగా తాకారంటూ వాపోయింది మౌనీ రాయ్.
Also Read: ప్రియాంక చోప్రా.. టాలీవుడ్లో డబుల్ ధమాకా.!
వున్నపళంగా ఆ ఈవెంట్ నుంచి మౌనీ రాయ్ బయటకు వచ్చేయడంతో తొలుత ఎవరికీ అక్కడేం జరిగిందన్నది అర్థం కాలేదు.
ఆ తర్వాత, అసలు విషయం బయటకు వచ్చింది. సంబంధిత వీడియోలూ వెలుగు చూశాయి. ఇక్కడా, నిర్వాహకుల వైఫల్యమే సుస్పష్టం.
ఈవెంట్స్‌లో డాన్స్ చేయడమైనా, ‘వర్క్ లైఫ్’ కిందకే వస్తుంది. తమ వర్క్ లైఫ్ భద్రతతో కూడినదై వుండాలని మౌనీ రాయ్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించింది.
మౌనీ రాయ్‌కి పలువురు సినీ ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు.
