Sathi Leelavathi Review.. తప్పు ఎవరు చేశారు.? శిక్ష ఎవరికి.? ఎవరు విలన్.? ఎవరిది హీరోయిజం.? అంటే, పరిస్థితులే వ్యక్తుల్ని ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తాయ్.. అని చెప్పాలి.
తండ్రి మంచోడే, కానీ.. ఒకప్పుడు చెడ్డోడు. భర్త కూడా మంచోడే, కానీ.. చెడ్డోడిలా మారాడు. భార్య కూడా మంచిదే, కానీ.. భర్తను ఇబ్బంది పెట్టింది.
అంతిమంగా, తండ్రి మంచోడయ్యాడు.. భర్త కూడా మంచోడయ్యాడు.. భార్య కూడా మంచిదే అయ్యింది. అన్ని పాత్రలకీ శుభం కార్డు పడింది.
చాలా అరుదుగా చూస్తుంటాం ఇలాంటి సినిమాల్ని. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సతీ లీలావతి’. దేవ్ మోహన్, నరేష్, మడోన్నా సెబాస్టియన్ ఇతర ప్రధాన తారాగణం.
దర్శకురాలు లీల, తన వర్క్‌లో బిజీ బిజీ.. భర్త సేతు, భార్య లీల నుంచి విడాకులు కోరుకుంటాడు. విషయం తెలిసి షాక్‌కి గురవుతుంది లీల.
Sathi Leelavathi Review.. అంతా ఒక్క రోజులోనే..
ఒక్క రోజులోనే, కథంతా అయిపోతుంది దాదాపుగా. ఇంట్లో భర్తని బంధిస్తుంది లీల. ఆ ఇంటికి లాయర్ వస్తాడు. సేతు గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది.
ఇంకోపక్క, లీలని కిడ్నాప్ చేస్తాడు ఓ నిర్మాత. వున్నంతలో కథని ఎంటర్టైనర్‌గానే మలచేందుకు ప్రయత్నించారు. కాకపోతే, అక్కడక్కడా సాగతీత అనిపిస్తుంటుంది.
చాన్నాళ్ళ తర్వాత వెండితెరపై కనిపించింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఆమె అందమూ తగ్గలేదు.. నటనలో ఈజ్ కూడా తగ్గలేదు. అన్నిటికీ మించి, ఆ క్యూట్ అప్పీల్ అస్సలు తగ్గలేదు.

మొత్తం సినిమాని తన భుజాల మీద మోసింది లావణ్య త్రిపాఠి. మడోన్నా సెబాస్టియన్ కాస్సేపు తెరపై కనిపిస్తుంది. ఆమెది కూడా కీలక పాత్రే.
దేవ్ మోహన్, ‘లీల’ భర్త సేతుగా నటించాడు.. అతని నటన ఆకట్టుకుంటుంది. నరేష్ తన పాత్రకు న్యాయం చేశాడు.
‘లీల’ చిన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య వాగ్యుద్ధాలు.. ఆ తర్వాత, భార్య చనిపోయాక, ‘లీల’పై తండ్రికి పెరిగిన బాధ్యత.. ఈ వేరియేషన్స్ తన అనుభవంతో బాగానే చూపించగలిగారు నరేష్.
మిగతా పాత్రల్లో సప్తగిరి కాసిన్ని మెరుపులు మెరిపించాడు. అరవ బ్యాచ్ కమెడియన్స్ ‘మమ’ అనిపించారు.
సినిమాటోగ్రఫీ బావుంది.. మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే, కొన్ని సన్నివేశాలపై నిర్దాక్షిణ్యంగా కత్తెర దాడి చేసి వుండాల్సింది.
సినిమాకి అవసరమైన మేర ఖర్చు చేశారు. రిచ్‌గానే కనిపిస్తుంది. క్లయిమాక్స్ కోసం డిజైన్ చేసిన గేమ్ సిల్లీగా అనిపిస్తుంది. కాకపోతే, కామెడీగా తెరకెక్కించారు కాబట్టి ఓకే.
తెరపై లావణ్య ఎనర్జీ, ఈజ్.. అదుర్స్..
లావణ్య త్రిపాఠి తెరపై చూపించిన ‘ఈజ్’, ప్రదర్శించిన ‘ఎనర్జీ’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా ఎంజాయ్ చేస్తూ, సినిమాని చేసిందామె. ఆ విషయం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది.
ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు వెతక్కూడదు. దర్శకుడు, తాను తెరకెక్కించాలనుకున్నది బాగానే తెరకెక్కించాడు. కాకపోతే, ఇలాంటి సినిమాలకు ఎంటర్టైన్మెంట్ డోస్ ఇంకాస్త ఎక్కువ వుండాలి.
ఓటీటీలో అయితే టైమ్ పాస్. థియేటర్లకు వెళ్ళి, ఇలాంటి సినిమాలు చూసేంత తీరిక జనాలకు వుండటంలేదు. పబ్లిసిటీ ఎంత చేసుకున్నా, ఓటీటీ కోసమే.. అన్నట్లయిపోయింది వ్యవహారం.
Also Read:
ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ సినిమా ఈ ‘సతీ లీలావతి’. టైటిల్ వినగానే, కమల్ హాసన్ సినిమా గుర్తుకొస్తుంది ఎవరికైనా. అదైతే, కడుపుబ్బా నవ్వించే కామెడీ.
ఆ ‘సతీ లీలావతి’ సినిమాని, ఈ ‘సతీ లీలావతి’తో పోల్చకూడదు. కానీ, ముందే చెప్పుకున్నట్లు.. ఓ సారి ఓటీటీలో నిరభ్యంతరంగా చూసెయ్యొచ్చు.
