Home » విజయ్ సేతుపతి ‘బత్తా’ రివ్యూ.! ఇద్దరూ ఇద్దరే.!

విజయ్ సేతుపతి ‘బత్తా’ రివ్యూ.! ఇద్దరూ ఇద్దరే.!

by Mudra369 Editorial Desk
0 comments
Baththa Review Vijay Sethupathi

Vijay Sethupathi Baththa Review.. విజయ్ సేతుపతి విలక్షణ నటుడు. స్టార్ హీరోలతో సమానంగా విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాోలయింగ్ వుందనడం అతిశయోక్తి కాదు.!

విజయ్ సేతుపతి నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయి వుండొచ్చుగానీ, నటుడిగా విజయ్ సేతుపతి ఇప్పటిదాకా ఫెయిల్ అయ్యిందే లేదు.!

కథల ఎంపికలో కూాడా విజయ్ సేతుపతిది విలక్షణమైన శైలి. అందుకే, అతన్ని విలక్షణమైన కథలు వెతుక్కుంటూ వెళతాయి.

అసలు విషయానికొస్తే, ‘బత్తా’ అనే సినిమాతో విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోందిప్పుడు. ఓటీటీలో సినిమా విడుదలయ్యాక, మరింతగా విజయ్ సేతుపతి పేరు హాట్ టాపిక్ అవుతోంది.

నిజానికి, ‘బత్తా’ సినిమాలో విజయ్ సేతుపతి కంటే, ఓ చిన్న పిల్లాడి గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆ పిల్లాడి పేరు మాస్టర్ సాయి పృధ్వీరాజ్.

Vijay Sethupathi Baththa Review.. కథలోకి వెళితే..

‘బత్తా’ అలియాస్ భక్త వత్సలం పేరు మోసిన రౌడీ.! బత్తా అంటే, అందరికీ హడల్. అలాగే, ఓ చిన్న కుర్రాడు శబరికి కూడా ‘బత్తా’ అంటే భయమే.!

శబరి చదువుతున్న స్కూలు, బాత్రూములో అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోతాడు బత్తా.! అదీ, శబరి కారణంగానే.! అసలు ‘బత్తా’ ఆ స్కూల్లోకి ఎందుకు వెళ్ళాడన్నది చివర్లో తేలుతుంది.

రోజుల తరబడి ‘బత్తా’ ఆ స్కూలు బాత్రూములోనే ఇరుక్కుపోతాడు.

బత్తా బయటకొస్తే, తనను చంపేస్తాడేమోనన్న భయంతో, బత్తాని బయటకు రానీయకుండా, అతనికి అందులోనే రోజూ ‘రస్కులు’ పెడుతుంటాడు శబరి.

బంధించినోడే, బతికిస్తాడు..

ఓ రోజు, ఎలాగైతేనేం, శబరి సాయంతోనే బతికి బట్టకడతాడు బత్తా. కానీ, తనను బంధించింది ఎవరన్నది ‘బత్తా’కి తెలియదు.

ఒకానొక సందర్భంలో శబరి, తానే బాత్రూమ్ గడియ పెట్టానని శబరి ఒప్పేసుకుంటాడు బత్తా దగ్గరే. ఆ తర్వాత ఏమయ్యిందన్నది క్లయిమాక్స్.

సరదాగా సాగిపోతుంటుంది సినిమా.! కథ అక్కడక్కడా లాగ్ అనిపిస్తుంది. కానీ, ఓకే.! మరీ గొప్ప సినిమా.. అనలేంగానీ, జెన్యూన్ అటెంప్ట్.. అని మాత్రం చెప్పొచ్చు.

పేరుమోసిన రౌడీ, బాత్రూమ్‌లో ఇరుక్కుపోయి రోజుల తరబడి బయటకు రాలేకపోయాడంటే నమ్మశక్యంగా అనిపించదు. బాత్రూమ్ డోర్లు మరీ అంత ధృఢంగా వుండవ్ కదా.!

సినిమా మొత్తం ‘శబరి’ చుట్టూనే తిరుగుతుంది. మాస్టర్ సాయి పృధ్వీరాజ్ నటన అద్భుతం. ఆద్యంతం అలరించాడు. అమాయకంగా కనిపిస్తూనే, చాలా కాన్ఫిడెంట్‌గా నటించేశాడు.

అదే విజయ్ సేతుపతి ప్రత్యేకత..

విజయ్ సేతపతి, ఈ సినిమాని ఓకే చెయ్యడంతోనే, తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమా కోసం ఏం చేయాలో, అంతా చేశాడు.

మిగతా పాత్రల్లో ‘బత్తా’ భార్య పాత్రలో లిజిమోల్ జోస్ ఆకట్టుకుంటుంది. మిగిలినవారంతా తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు.

సినిమాటోగ్రఫీ, సినిమాకి తగ్గట్టుగా వుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా వుంటే బావుండేది. నేపథ్య సంగీతం బావుంది. పాటలూ ఓకే.

అవసరమైనంత మేర సినిమాకి ఖర్చుపెట్టారు. సినిమా చాలా క్లీన్‌గా వుంది. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు. హాయిగా నవ్వుకోవచ్చు.

‘శబరి’ని చూసినప్పుడల్లా, చాలామంది తమ చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడం ఖాయం.! ఇక్కడే దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.

సినిమా అంటే, రక్తపుటేరులు.. వల్గారిటీ కానే కాదు..

సినిమా అంటే, రక్తపుటేరులు పారించడం, రొమాన్స్ పేరుతో జుగుప్సాకరమైన వల్గారిటీని చూపించడం.. ఇదే సినిమా.. అన్న భ్రమల్లో కొందరున్నారు.

కానీ, ‘బత్తా’ లాంటి సినిమాలే, అసలు సిసలు సినిమాలు.! కుటుంబమంతా కలిసి కూర్చుని హాయిగా చూడగలిగేదే సినిమా.!

‘బత్తా’ ఎందుకు స్కూలు బాత్రూములోకి వెళ్ళి ఇరుక్కుపోయాడో తెలుసా.? ‘బత్తా’ ఓ భయంకరమైన సింగర్.! తన కళని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో, సీక్రెట్‌గా ప్రాక్టీస్ మొదలెడతాడు.

చివరికి తన కుమార్తె శారీ ఫంక్షన్‌లో పాట పాడి, అందరి ప్రశంసలు అందుకుంటాడు. అలా కథ సుఖాంతమవుతుంది.

అన్నట్టు, రోజుల తరబడి బాత్రూమ్‌లో ఇరుక్కుపోయిన ‘బత్తా’కి తత్వం బోధపడుతుంది. మంచి మనిషిగా మారతాడు. ఇదీ దర్శకుడు ఇవ్వదలచుకున్న మెసేజ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group