Table of Contents
Itlu Arjuna Review.. తెలుగు సినిమాకి కొత్తగా ఓ హీరో పరిచయమవుతున్నాడంటే, బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని దర్శకుడు డిజైన్ చేసుకుని వుండాలి.
డైలాగ్స్ అదిరిపోవాలి.! డాన్సులు ఇరగదీసెయ్యాలి.! హీరోయిన్ గ్లామర్ సహా, ఇతర కమర్షియల్ హంగుల విషయంలో అస్సలేమాత్రం లోటుండకూడదు.!
కొత్త హీరో అనీష్ విషయంలో కూడా ఇలాంటివన్నీ ఆశిస్తాం. ఎందుకంటే, ‘ఇట్లు అర్జున’ సినిమా రిలీజ్‌కి ముందు చేసిన హంగామా అలాంటిది.!
అగ్ర హీరోలు, తమకు తోచిన విధంగా ‘ఇట్లు అర్జున’ సినిమాని ప్రమోట్ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అసలేముంది ఈ కుర్రాడిలో అంత కొత్తగా.? అని ఆశ్చర్యపోయారంతా.
ఎలాగైతేనేం, థియేటర్లలోకి ‘ఇట్లు అర్జున’ సినిమా వచ్చేసింది. కొత్త కుర్రాడెలా చేశాడు.? అన్న ఉత్కంఠకు తెరపడింది.
Itlu Arjuna Review.. కథ, కమామిషు.. ఏంటంటే..
ఓ సాధారణ యువకుడే హీరో.! కాకపోతే, మాటలు రావు. హీరోియన్ అందగత్తె.. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ, ప్రేమను వ్యక్తం చేయడానికి ‘మాట’ అడ్డం వస్తుంది.
ఓ పెద్ద విలన్.. వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం.! అందులో హీరో, హీరోయిన్ ఇరుక్కుపోతారు. అన్నట్టు, మూగడవాడైనప్పటికీ.. హీరో ఓ చిల్లర దొంగ.!
అంత పెద్ద విలన్ నుంచి ఈ క్యూట్ జంట ఎలా తప్పించుకుంటుంది.? వెయ్యి కోట్ల హవాలా గొడవలో ఈ జంట ఎలా ఇరుక్కుంది.? ఇదే అసలు కథ.!
చాలా సినిమాల్లో ఇలాంటి కథల్ని చూసేసినట్లు అనిపిస్తుంది కదా.! అయితే, అది మీ తప్పు కాదు.! కానీ, దర్శకుడు ఈ కథని ఎలా నడిపాడు.? నటీనటులు ఎలా చేశారు.? ఇవన్నీ తెలుసుకోవాలి కదా.!
ఎవరెలా చేశారంటే.!
నటుడిగా తనకిది తొలి సినిమానే అయినా, అనీష్ చాలా బాగా చేశాడు. డాన్సుల్లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు.
హీరో మూగవాడు కదా.. డైలాగ్ డెలివరీ ఎలా వుంటుందన్నది ఈ సినిమా వరకు ఏం చెప్పడానికి లేదు. తదుపరి సినిమాల వరకూ వేచి చూడాల్సిందే.
మంచి డెబ్యూ లభించింది హీరో అనీష్‌కి. కాదు కాదు, తెరంగేట్రాన్ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడీ యంగ్ హీరో. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
హీరోయిన్ అనస్వర రాజన్, ఆల్రెడీ నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. మంచి నటి. తెరపై చాలా చురుగ్గా వుంటుంది. అదే ఆమె ప్రత్యేకత. ఈ సినిమాలోనూ తన పాత్రలో క్యూట్‌గా మెరిసింది.
వెన్నెల కిషోర్ కొన్ని నవ్వులు పూయించాడు. విలన్ పాత్రలో ముఖేష్ రుషి మామూలే.! కాకపోతే, పవర్ ఫుల్‌గా అతని విలనిజాన్ని మొదలెట్టినా.. దాన్ని కొనసాగించలేకపోయారు. ఇంకా బాగా ఆ పాత్రని డిజైన్ చేసి వుండాల్సింది.
మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్ చాలా రిచ్‌గా వున్నాయి. ఎడిటింగ్ బావుంది. సెకెండాఫ్‌లో కొన్ని సీన్స్ నిడివి తగ్గించొచ్చు. డైలాగ్స్ కూడా ఓకే.
డెబ్యూ అదిరింది..
మ్యూజిక్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. తెరపై చూడ్డానికీ పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సాధారణ సన్నివేశాల్నీ బాగా ఎలివేట్ చేసింది.
సినిమా ఆద్యంతం రిచ్‌గా కనిపిస్తుంది.. దానర్థం, ఖర్చుకి అస్సలేమాత్రం వెనుకాడలేదు మేకర్స్ అనే కదా అర్థం.! ఓ మంచి డెబ్యూని హీరోకి ఇచ్చారు దర్శక నిర్మాతలు.
హీరో కష్టపడ్డాడు, హీరోయిన్ బావుంది. కథ, కథనాలు కూడా బాగానే కుదిరాయి. కాకపోతే, సెకెండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ‘ల్యాగ్’ అనిపిస్తాయి. కొంత స్లో పేస్‌లో నడుస్తుంది సెకెండాఫ్.. అదీ కొన్ని సన్నివేశాలకే.
ట్విస్టులు కొన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. వెరసి, ముందే చెప్పుకున్నట్లు కొత్త హీరోకి.. మంచి లాంఛింగ్ దొరికిందని చెప్పొచ్చు
దర్శకుడూ ‘అతి’ పోకడలకు పోలేదు. కథ పక్కదారి పట్టకుండా, కొత్త హీరోని జాగ్రత్తగా లాంఛ్ చేయడానికి ప్రయత్నించారు మేకర్స్. ఆ ప్రయత్నం సఫలమైనట్లే.