Home » దీపిక రెమ్యునరేషన్ గోల: హీరోల మీద ఏడుపెందుకో.!?

దీపిక రెమ్యునరేషన్ గోల: హీరోల మీద ఏడుపెందుకో.!?

by hellomudra
0 comments

Depika Padukone Remuneration Fight.. కొన్ని సినిమాల్లో హీరో కంటే, హీరోయిన్ రెమ్యునరేషన్ ఎక్కువ వుంటుంది.! అందులో తప్పేముందసలు.? కానీ, రెమ్యునరేషన్ ఇవ్వాల్సింది నిర్మాత.!

ఓ సినిమా చేయాలని నిర్మాత అనుకున్నాక, చాలా లెక్కలేసుకుంటాడు. వాటిల్లో బడ్జెట్ లెక్కలు, కాంబినేషన్.. ఇంకా చాలా వుంటాయ్.

ఫలానా హీరో, ఫలానా హీరోయిన్, ఫలానా కమెడియన్, ఫలానా విలన్.. ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ చర్చకు వస్తాయ్. ఫైనల్‌గా ఓ మాట అనుకుంటారు.

హీరోకి ఎంతివ్వాలి.? హీరోయిన్‌కి ఎంతివ్వలి.? సినిమా నిర్మాణం కోసం అదనంగా ఖర్చు చేయాల్సిందెంత.? ఇలా ఓ పెద్ద ప్రసహనమే నడుస్తుంది.

ముందే చెప్పుకున్నట్లు, కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది హీరో కంటే. ఆ కథ డిమాండ్ మేరకు.. అనుకోవచ్చు.. లేదంటే, ఆ హీరోయిన్‌కి వున్న మార్కెట్ వాల్యూ కావొచ్చు.

Depika Padukone Remuneration Fight.. అనుష్క, నయనతార, త్రిష..

అనుష్క శెట్టి సినిమాలు కొన్నింటిని తీసుకుంటే, హీరో కంటే ఆమెకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన సందర్భాలున్నాయి. నయనతార, త్రిష.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద కథే.

తాజాగా, దీపిక పదుకొనే తన రెమ్యునరేషన్ విషయమై ఓ నిర్మాణ సంస్థతో గొడవ పడింది. లెక్కలు కుదరక, ఆ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారు.

‘నా రేంజ్ ఎక్కువ.. నాకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి.. ఇవ్వడంలేదు..’ అంటూ వాపోయింది దీపిక పదుకొనే. నో డౌట్, దీపిక పదుకొనే స్టార్ హీరోయిన్.

అయితే, ఆమెకు ఎంత ఇస్తే తమ ప్రాజెక్టు వర్కవుట్ అవుతుందో లెక్కలేసుకునేది నిర్మాత. సో, ఆమె కోరుకున్న రెమ్యునరేషన్ నిర్మాత ఇవ్వాలంటే, ఆ మార్కెట్ ఈక్వేషన్ సెట్ అవ్వాలి.

సెట్ అవ్వకపోతే, దీపిక స్థానంలో ఇంకో హీరోయిన్ ఆ ప్రాజెక్టులోకి వచ్చేస్తుంది. వచ్చేసింది కూడా.! అదే, ‘స్పిరిట్’.! నిర్మాతతో బేరసారాలు జరుగుతాయ్ నటీనటులకి.

మధ్యలో హీరోల మీద దీపిక ఏడిస్తే ఎలా.? హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో.. అది కూడా నిర్మాతే డిసైడ్ చేస్తాడు. హీరో అడిగినంత ఏ నిర్మాత ఇచ్చెయ్యడు గుడ్డిగా.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group