Geethu Mohandas Toxic Tollywood.. ఒకే ఒక్క సినిమా.. రిలీజ్‌కి ముందు ఆమె పేరు మార్మోగిపోయింది.! రిలీజ్ తర్వాత కూడా ఆమె పేరు మార్మోగిపోతూనే వుంది.!
కాకపోతే, విడుదలకు ముందు విపరీతమైన హైప్, పాజిటివిటీ.! విడుదలయ్యాక విపరీతమైన నెగెటివిటీ.! ఆ డైరెక్టర్ ఎవరో కాదు, గీతూ మోహన్ దాస్.
ఇండియన్ సినిమా ఎంతోమంది మహిళా దర్శకుల్ని చూసింది. కొందరు సంచలన విజయాల్ని అందుకున్నారు. కొందరు డిజాస్టర్లకే పరిమితమయ్యారు.
అయినాగానీ, కొత్తగా సినీ రంగంలోకి మహిళలు వస్తూనే వున్నారు. ఇంకా ఎక్కువగా రావాలి కూడా.! ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. సినీ రంగంలో కూడా సగం.. అన్నమాట.
‘టాక్సిక్’ సినిమా డిజాస్టర్.! ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ దెబ్బతో గీతూ మోహన్ దాస్ కెరీర్ అటకెక్కేసిందని అంతా అనుకున్నారు.
Geethu Mohandas Toxic Tollywood.. ‘టాక్సిక్’ ఫ్లాప్ అయినా.. అవకాశాలొస్తూనే వున్నాయ్..
కానీ, గీతూ మోహన్ దాస్‌కి ‘టాక్సిక్’ విడుదల కంటే ముందే చాలా అవకాశాలు వచ్చాయి. ఇంకా ఇంకా అలాంటి అవకాశాలు వస్తూనే వున్నాయి.
పలువురు హీరోలు.. నార్త్ నుంచి సౌత్ వరకూ.. గీతూ మోహన్ దాస్‌తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. కొందరు నిర్మాతలు ఆల్రెడీ ఆమెకు అడ్వాన్స్ ఇచ్చేశారన్న ప్రచారమూ జరుగుతోంది.
నిజానికి, ‘టాక్సిక్’ సినిమా డిజాస్టర్, కన్నడ సినిమాపై కొందరి నెగెటివిటీ కారణంగానే.. అన్న వాదన కన్నడ సినీ వర్గాల్లో వుంది.

సినిమాలో కంటెంట్ వుంటే, ‘కేజీఎఫ్’లా నెత్తిన పెట్టుకుంటారు. కంటెంట్ లేకపోతే ‘టాక్సిక్’ అయిపోతుంది. ఇదే, ఏ సినిమా పరిశ్రమకు చెందినవారైనా గుర్తు పెట్టుకోవాల్సి వుంది.
సింపతీతో కొందరు కన్నడ సినీ ప్రముఖులు గీతూ మోహన్ దాస్‌కి బాసటగా నిలుస్తూ, ఆమెతో సినిమాలకు ముందుకొస్తున్నారు.
కానీ, ‘టాక్సిక్’ సినిమాలో స్టైలిష్ మేకింగ్ నచ్చి, టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు, పలు నిర్మాణ సంస్థలూ గీతూ మోహన్ దాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం.
అన్నీ కుదిరితే, ఓ యంగ్ హీరో తదుపరి సినిమా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం వుందట. ఎవరా హీరో.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!
