నిన్న జీరో, నేడు హీరో.. బిగ్ హౌస్‌లో ఈక్వేషన్స్ (Bigg Boss 3 Punarnavi Game Changer) ఎప్పుడెలా మారతాయో ఊహించలేం. మూడో సీజన్ బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? అన్న ప్రశ్నకు మొట్టమొదట వచ్చిన సమాధానం శ్రీముఖి (Sree Mukhi). ఆమె ఇప్పటికీ అదే ప్లేస్‌లో వుందా?
వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాటేమిటి.? వితిక షెరు (Vithika Sheru) ఇస్తోన్న పోటీ ఎలాంటిది.? పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam) ఎంత స్ట్రాంగ్? రవి కృష్ణ (Ravi Krishna), అలీ రెజా (Ali Reza), రాహుల్ సిప్లిగంజ్.. (Rahul Sipligunj) ఇలా ఎవరూ తక్కువ కాదు. ఆ మాటకొస్తే, సైలెంట్‌గా వున్న అషు రెడ్డిని తక్కువగా అంచనా వేయలేం.
సావిత్రి ఎంత స్ట్రాంగో పలు సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. హిమజ (Himaja) తన విశ్వరూపాన్ని రీసెంట్‌గా ప్రదర్శించింది. జాఫర్ ఎలిమినేషన్ తర్వాత బాబా భాస్కర్ (Baba Bhaskar) చాలా మారిపోయాడు. రోహిణి (Rohini) కూడా పెర్‌ఫెక్ట్ గేమ్ ప్లే చేస్తోంది. అవును, ఎవరూ తక్కువ కారు.
‘సరిలేరు నీకెవ్వరూ’ అనే స్థాయిలోనే బిగ్ హౌస్‌లో ఈక్వేషన్స్ కన్పిస్తున్నాయి. క్షణ క్షణం ఈక్వేషన్స్‌లో చాలా చాలా పెద్ద మార్పులు జరిగిపోతున్నాయి. సైలెంట్‌గా వుండే కంటెస్టెంట్ వైలెంట్‌గా మారిపోతున్నారు. వైలెంట్‌గా వుండే కంటెస్టెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 3) తనదైన స్టయిల్లో టాస్క్‌లను ప్లాన్ చేస్తుండడం అన్నిటికన్నా పెద్ద విశేషమిక్కడ.
పునర్నవి.. కొత్త కొత్తగా..
హౌస్‌లో రెబల్ స్టార్‌లా మారిపోయిన పునర్నవిని (Punarnavi Panthers) సీక్రెట్ టాస్క్‌కి పంపడం ద్వారా బిగ్ హౌస్, ఆమెలో ఇంకో యాంగిల్‌ని చూపించాడు. పునర్నవి ఎంత గేమ్ ప్లానరో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. అలాగే హిమజ సహా, హౌస్ మేట్స్ ఆలోచనలెలా వున్నాయో పునర్నవి, అలీ రెజా తెలుసుకున్నారు. శ్రీముఖి మైనస్‌లు మళ్ళీ మళ్ళీ బయటపడ్తున్నాయి.
అందరికంటే పెద్ద షాక్ హిమజనే (Himaja Army). అనూహ్యంగా తనలోని ఇంకో యాంగిల్‌ని పరిచయం చేసేస్తుంటుందామె. ఒకటి కాదు, రెండు కాదు.. ఆమెలో చాలా కోణాలున్నాయి. హౌస్ నుంచి ఇద్దరు కన్పించకుండా పోతే, ఇద్దరు పోటీదారులు తగ్గారన్నట్లు కనిపించింది హిమజ ఆటిట్యూడ్. మొత్తం బిగ్‌హౌస్ కంటెస్టెంట్స్‌తోపాటు, చూస్తున్న వ్యూయర్స్ ఆమె తీరుకి షాక్ అయ్యారు.
ఇదిలా వుంటే, పునర్నవి హౌస్‌లో ‘గ్రూప్’ (Bigg Boss 3 Telugu)ఆవశ్యకతను గురించి తెలుసుకుంది. సపోర్టర్స్‌ని పెంచుకునే పనిలో బిజీ అయిపోయింది. రవి కృష్ణ సహా పలువురితో క్లోజ్ అవుతోంది. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారీ తప్పించుకోవడం ఎవరికైనా బిగ్ టాస్క్. హౌస్‌లో అందర్నీ కలుపుకుపోకపోతే, తనకు ప్రతి వారం ఎలిమినేషన్ తప్పదనే విషయం అర్థమయిపోయిందామెకి.
కథ మారుతోంది..
ప్రస్తుతం బిగ్ హౌస్‌లో (Bigg House) దాదాపు అరడజను మంది పునర్నవికి సపోర్ట్‌గా నిలిచే పరిస్థితి కన్పిస్తోంది. ఇదిలా వుంటే, హౌస్‌లో శ్రీముఖి పరిస్థితే అయోమయంగా మారిపోయింది. ఇప్పటికిప్పుడు ఆమెకు హౌస్‌లో పెద్దగా థ్రెట్ లేకపోయినా, తమన్నా విషయంలో ఆమె చూపుతున్న అత్యుత్సాహం సోషల్ మీడియాలో శ్రీముఖికి చాలా నెగెటివిటీని క్రియేట్ చేసింది.
బాబా భాస్కర్ (Baba Bhaskar) ఇమేజ్ కూడా ఇటీవలి కాలంలో బాగా పడిపోయినట్లే కన్పిస్తోంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్ విపరీతమైన ఛేంజెస్ కన్పించాయి బిగ్ హౌస్‌లు. వారు.. వీరయ్యారు, వీరు.. వారయ్యారు వీక్ స్టార్టింగ్ నుంచి వీకెండ్ వచ్చేసరికి. తమన్నా సింహాద్రి, పునర్నవి (Bigg Boss 3 Punarnavi Game Changer), బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వితిక షెరులలో ఎవరో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అవబోతున్నారు.
కాగా, లేటెస్ట్ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్, బిగ్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి (Bigg Boss 3 Punarnavi Game Changer) నిబంధనలు పాటించడంలేదంటూ ఇచ్చిన పనిష్‌మెంట్ చూసేవారికి సరదాగానే వున్నా, చేసేవాళ్ళకి సరదా తీర్చేసింది.
స్విమ్మింగ్ పూల్‌లో మునక, వరుణ్ సందేశ్ (Varun Sandesh) గేట్ కీపర్‌గా వ్యవహరించడం, నీళ్ళు నింపిన డబ్బాకి వున్న కన్నాల్నివ వేలితో మూయాల్సి రావడం.. ఇవన్నీ స్వీట్ అండ్ హాట్ పనిష్‌మెంట్స్. నాగ్ వచ్చేస్తాడు.. ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. వికెట్ ఎవరిది పడుతుందో ఆదివారం తెలిసిపోతుంది.