Pragya Jaiswal Gym Show.. ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది.
సినిమాల సంగతెలా వున్నా.. సోషల్ మీడియాలో ఫిట్నెస్ పాఠాలు చెబుతూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది.
తాజాగా జిమ్ సెషన్ పూర్తి చేసుకుని ప్రగ్యా జైశ్వాల్ కొన్ని సెల్ఫీ పోజులిచ్చింది. ఈ సెల్ఫీ పోజుల్లో ప్రగ్యా కొంటె చూపులు నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయ్.
‘కంచె’ సినిమాతో డెబ్యూ చేసిన ప్రగ్యా, ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేసి, నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ‘అఖండ’ సినిమాలో నటించింది
అఖండమైన విజయాన్ని సైతం అందుకుంది. ఇంకేముంది.! స్టార్ హీరోయిన్ల లిస్టులోకి ప్రగ్యా జైశ్వాల్ పేరు చేరిపోయిందనుకున్నారంతా.
Pragya Jaiswal Gym Show.. కొంటె చూపుల కోనంగి..
కానీ, ఆమె విజయం అక్కడితోనే ఆగింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. కానీ, ఎప్పటికప్పుడు తాజాగా సోషల్ మీడియాని హీటెక్కిించడంలో తనదైన టాలెంట్ చూపిస్తుంటుంది ప్రగ్యా జైశ్వాల్.
జిమ్ వర్కవుట్స్ సెషన్లో భాగంగా ప్రగ్యా జైశ్వాల్ కొన్ని సెల్ఫీ పోజులు తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. బ్రైట్ రెడ్ కలర్ స్పోర్ట్స్ టాప్‌లో దిగిన ఈ సెల్ఫీలు నెటిజనానికి భలే కిక్కిస్తున్నాయ్.
ఫ్రెష్‌గా వర్కువుట్స్ చేసింది కదా.! ఆ గ్లో ఫేస్‌లో అలాగే వుంది. ఆ గ్లోకి ఆమె ముఖంలోని చిరునవ్వు తోడయ్యింది. ఈ రెండింటికీ మించి ప్రగ్యా ‘వింక్’ (కన్ను కొట్టడం) స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బ్యాక్ గ్రౌండ్లో పంచింగ్ బ్యాగ్, మరియు జిమ్ ఎక్విప్మెంట్ కనిపిస్తుండగా.. ప్రగ్యా తన ఎనర్జిటిక్ వైబ్స్‌తో పిక్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చేసింది.

నటనలో మంచి క్రేజ్ సంపాదించిన ప్రగ్యా జైశ్వాల్, తన పర్ఫెక్ట్ ఫిజిక్తోనూ అంతే క్రేజ్ దక్కించుకుంటోంది. క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ ఫిట్నెస్ గోల్స్ సెట్ చేస్తుంటుంది.
జిమ్‌లో వర్కవుట్స్ చేయడం అంటే.. ఏకధాటిగా కష్టపడిపోయి చెమటోడ్చేయడమే కాదు.. వర్వవుట్స్ని ఎంజాయ్ చేయడం కూడా.! అని ఈ ఫోటోస్‌తో ప్రగ్యా ప్రూవ్ చేస్తున్నట్లుంది.!
వావ్.! సూపర్బ్.! నిజంగా ఇదీ ఓ మంచి సందేశమే సుమీ.! హ్యాట్సాప్ ప్రగ్యా జైశ్వాల్.!