Home » దసరా శరన్నవరాత్రులు: నాలుగవ రోజు ‘మహా చండీ’ దేవి

దసరా శరన్నవరాత్రులు: నాలుగవ రోజు ‘మహా చండీ’ దేవి

by Mudra369 Editorial Desk
0 comments
Maha Chandi Devi Vijayadasami

Maha Chandi Devi Vijayadasami.. సకల దేవతల తేజస్సు మరియు త్రిశక్తుల సంకల్పం మేళవించిన పరబ్రహ్మ శక్తి స్వరూపమే ‘మహా చండి’ రూపం.

నవ రాత్రుల దీక్షలో భక్తులను సర్వ భయాల నుంచి రక్షించడానికి, దుష్ట శక్తులను పారద్రోలే శక్తి స్వరూపిణిగా ఈ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

పూర్వం శుంభుడు, నిశుంభుడు, చండ,ముండులు మరియు రక్త బీజుడు అనే రాక్షసులు వుండేవారు. తమ కఠోరమైన తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి అసాధారణమైన వరాలు పొందారు ఈ రాక్షసులు.

ఆ వర గర్వంతో ముల్లోకాలనూ, దేవ దేవతలను తమ అకృత్యాలతో పీడించసాగారు. దేవతలు వీరి బాధలు తాళలేక హిమవత్ పర్వతాల్లో దీక్షలో వున్న జగన్మాతను శరణు వేడుకున్నారు.

అంతట జగన్మాత తన కౌశికి శరీర కోశం నుంచి మహాచండి రూపంలో అవతారమెత్తింది. ఆ రాక్షసులను సంహరించడానికి బయలుదేరింది.

Maha Chandi Devi Vijayadasami.. మహా చండీ – సర్వాయుధధారిణి..

ఈ నేపథ్యంలోనే దేవ దేవుళ్లంతా తమ తమ ప్రత్యేకమైన శక్తివంతమైన ఆయుధాల్ని మహా చండికి సమర్పించుకున్నారు. అలా పరమ శివుడు తన త్రిశూలాన్నివ్వగా విష్ణువు సుదర్శన చక్రం ఇచ్చాడు.

అలాగే, వరుణుడి పాశం, ఇంద్రుడి వజ్రాయుధం, అగ్ని దేవుడు తన అపారమైన శక్తిని జగన్మాతలో ఐక్యం చేశారు. సర్వాయుధధారిణిగా సింహావాహనంపై ఆశీనురాలై జగన్మాత మహా చండి రూపంలో సమర శంఖం పూరించింది.

ఈ భయంకరమైన యుధ్ధంలో చండ ముండులను సంహరించి ‘చాముండి’గా కీర్తి గాంచింది. అలాగే, శంభు, నిశుంభులను సంహరించింది.

తన శరీరం నుంచి రాలే ఒక్కో రక్తపు బొట్టు నుంచి మరో రక్త బీజుడు ఉద్భవించగల శక్తి రక్త బీజుడికుంది.

అలా అంతమే లేని రక్తబీజుడి ఒక్క రక్తపు బొట్టు కూడా నేల జారకుండా అంతమొందించి విశ్వానికి శాంతి చేకూర్చింది.

త్రిశక్తి సమ్మేళణి – సర్వ కార్య సిద్ధి ప్రదాయిని

మహా చండి అంటే కేవలం రాక్షస సంహారమే కాదు. శ్రి శక్తుల సమ్మేళనం. ‘మహా కాళి (మనిషిలోని ఇచ్ఛా శక్తి), మహా లక్ష్మి (క్రియా శక్తి), మహా సరస్వతి (జ్ఞాన శక్తి) ఇలా త్రిమూర్తి శక్తుల సమ్మేళనం.

అమ్మవారు సంహరించిన ఐదుగురు రాక్షసులు మనిషిలోని అరిషడ్వర్గాలు.. కామ, క్రోథ, లోభ, మధ, మాత్సర్యాలనే దుర్గుణాలకు ప్రతీకలు..

మహా చండీ అవతారంలో అమ్మవారిని భక్తితో పూజించడం ద్వారా మనిషిలో అంతర్గతంగా దాగి వున్న ఈ దుర్గుణాలను జయించే ఆత్మ శక్తిని పొందగలడన్న సంధేశం ఈ అవతారం ద్వారా తెలుస్తుంది.

ఈ రూపంలో అమ్మవారిని కొలవడం ద్వారా ఆత్మ విశ్వాసం, ధైర్యం. సంకల్ప బలం చేకూరుతాయ్.

ఈ రోజు ప్రత్యేకంగా చేసే చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఆటంకాలు తొలిగి చేపట్టిన కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

ఎరుపు మరియు పసుపు రంగుల కలయిక కలిగిన చీరను అమ్మవారికి చండీ అవతారంలో అలంకరిస్తారు. పులిహోర, కదంబం,, వడపప్పు పానకం నైవేద్యాలుగా సమర్పిస్తారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group