Home » అయేషాఖాన్.. ముక్కు పుడక.! మత్తెక్కిస్తున్నది చాలిక.!

అయేషాఖాన్.. ముక్కు పుడక.! మత్తెక్కిస్తున్నది చాలిక.!

by Mudra369 Editorial Desk
0 comments
Ayesha Khan

Ayesha Khan Trendy Nose Ring.. స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తనదైన గుర్తింపు దక్కించుకుంది ఆయేషా ఖాన్.

అప్పుడెప్పుడో ఏక్తా కపూర్ రూపొందించిన ‘కసౌతీ జిందగీ కే’ అనే హిందీ సీరియల్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది ఆయేషా.

ఆ తర్వాత కూడా కొన్ని బుల్లితెర సీరియల్స్‌తోనే పాపులర్ అయ్యింది. తెలుగులో శ్రీ విష్ణు నటించిన ‘ఓం భీమ్ భుష్’ సినిమాలో ‘రత్తాలు’ పాత్రలో నటించింది.

Ayesha Khan Trendy Nose Ring.. అయేషా గ్లామర్ ఫైర్.!

అలాగే విశ్వక్ ‌సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, శర్వానంద్ ‘మనమే’ సినిమాలో స్పెషల్ రోల్స్ పోషించింది. ఇటీవల వచ్చిన ‘దురంధర్ 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆయేషాకి తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చింది.

ఈ సాంగ్‌లో ఆయేషా వేసిన హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నతనం నుంచీ నటన పట్ల మక్కువ ఎక్కువ ఆయేషా ఖాన్‌కి.

Ayesha Khan
Ayesha Khan

అదే ఇంట్రెస్ట్‌తో స్కూల్ ఫంక్షన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. స్టేజ్ షోస్ అంటే ఆయేషానే ముందుండేదట. అలా ఆమె నటనా ప్రస్థానం అప్పటి నుంచే మొదలైందని చెప్పొచ్చు.

ఇక, సోషల్ మీడియాలో అయితే ఆయేషా ఫుల్ ట్రెండింగ్. తనదైన గ్లామరస్ లుక్స్‌తో కేక పుట్టిస్తుంటుంది. కుర్రకారులో ఎప్పుడూ హీట్ పెంచేస్తుంటుంది.

అద్దంలా మారిపోయిందా.!

లేటెస్టుగా దీపావళి సందర్భంగా రూపొందించిన ఓ మ్యాగజైన్‌లో ఆయేషా చిచ్చుబుడ్డిలా మెరిసింది. బ్లాక్ కలర్ బెనారస్ అవుట్ ఫిట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఆయేషా ఖాన్.

అందంగా కనిపించడం కన్నా.. ట్రెడిషన్‌ని పక్కాగా ఫాలో అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ ముక్కు పుడక.. ఆమె అందాన్ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిపోయింది.

Ayesha Khan
Ayesha Khan

అసలు సిసలు సాంప్రదాయం నిండిన ఆయేషా ఈ గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. ఆమె అందానికీ మత్తెక్కించే చూపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

ఆయేషా అందానికి మురిసిపోతూ.. ఫ్లోర్ కూడా అద్దంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో అన్నట్లున్నాయ్.. ఫ్లోర్‌పై పడుకుని ఆయేషా ఇచ్చిన పోజులు ఈ పిక్స్‌లో.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group