Home » బిగ్ క్వశ్చన్: సినిమాలకి పవన్ కళ్యాణ్ ‘టైమ్’ ఇస్తారా.?

బిగ్ క్వశ్చన్: సినిమాలకి పవన్ కళ్యాణ్ ‘టైమ్’ ఇస్తారా.?

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Cinematic Suspense.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చాలా బిజీగా వున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.

కానీ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘పవన్ కళ్యాణ్‌‌తో సినిమా గురించి చర్చించాను’ అని తాజాగా చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

‘వకీల్ సాబ్’ తర్వాత, పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసం దిల్ రాజు చాలా చాలా ప్రయత్నాలే చేశారు, కానీ.. అవేవీ ఫలించడం లేదు.

2024 ఎన్నికల కంటే ముందు కమిట్ అయిన సినిమాల్ని, ఆ మాటకొస్తే 2019 నాటి సినిమాల్ని.. ఎలాగోలా పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగారు.

Pawan Kalyan Cinematic Suspense.. కొత్త సినిమాకి కమిట్ అయ్యే పరిస్థితులున్నాయా.?

ఇప్పుడైతే, ఆయన కొత్తగా ఓ సినిమాకి కమిట్ అయి, పూర్తి చేయగలిగే పరిస్థితులు లేవు. మొన్నీమధ్యనే పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ జరిగింది. మరో భుజానికి సర్జరీ జరగాల్సి వుంది.

సర్జరీ జరిగితే, ఇంకో ఆర్నెళ్ళు కష్టమే.! ఎలా చూసుకున్నా.. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశమే లేదు.

అన్నట్టు, ‘ఓజీ’ సినిమా తర్వాత దానికి కొనసాగింపుగా ఇంకో సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సి వుంది. దర్శకుడు సుజీత్, ఆ ప్రాజెక్ట్ వ్యవహారాల్లో బిజీగా వున్నాడు. కానీ, అది కూడా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియదు.

ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా చర్చలు జరిపినట్లు దిల్ రాజు స్వయంగా చెప్పుకున్నా, ఆ మాటల్ని ఎవరూ విశ్వసించే పరిస్థితులు లేవు.

పుకార్లు మామూలే..

వ్యక్తిగత జీవితంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలు చేయకపోవడానికి ఓ కారణం కావొచ్చన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.

అయితే, పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారనీ, డేట్స్ కూాడా ఇచ్చేశారనీ, కథ ఖరారైపోయిందనీ.. రకరకాల ఊహాగానాలు వినిపించడం మామూలే.

సినిమా రంగంలో పవన్ కళ్యాణ్‌కి వున్న క్రేజ్ అలాంటిది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ న్యూస్ కంటే, పవన్ కళ్యాణ్ సినిమా న్యూస్‌కి రేంజ్ ఎక్కువ. ఈ క్రమంలో గాసిప్స్ అలా పుట్టుకొస్తుంటాయంతే.

ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల ఆశలు తప్పు కాదు గానీ..

అటు సుజీత్ సినిమా, ఇటు దిల్ రాజు సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేసేస్తే బావుంటుందని అభిమానులు ఆశిస్తే, అది తప్పెలా అవుతుంది.?

ఇప్పుడు నడుస్తున్నది 2026. పూర్తయిపోతోంది కూడా.! 2027లోకి ఎంటర్ అయిపోవడానికి, జస్ట్ నెలన్నర మాత్రమే మిగిలి వుంది.

2027 వచ్చేసిందంటే, అక్కడికి ఇంకో రెండేళ్ళలోనే సార్వత్రిక ఎన్నికలు.! సో, మళ్ళీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ బిజీ బిజీ అయిపోతారు.!

ఎలా చూసినా, పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకు వచ్చి, ఏడాదిలో విడుదలైపోవడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా అసాధ్యం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group