Nupur Sanon Beauty In Black.. మాస్ రాజా రవితేజతో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ నుపుర్ సనన్.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలిగా తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్‌లనూ పలు సినిమాల్లో నటించింది నుపుర్.!
కృతి సనన్ విషయానికొస్తే, ‘1 – నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో ఆమెను తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.
ఒకటీ, అరా తెలుగు సినిమాలు చేసి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదా దక్కించేసుకుంది. ఆ తర్వాత వచ్చిన నుపుర్ సనన్‌ని తెలుగు ఆడియన్స్ అక్కున చేర్చుకుంటారనిపించింది. కానీ అదీ కుదరలేదు.
తెలుగు ఆడియన్స్ మెచ్చే చక్కని ముఖ వచ్ఛస్సు, అభినయం ఇవన్నీ నుపుర్ సనన్‌లో పుష్కలంగా వున్నాయ్. కానీ, లక్కు కలిసి రాలేదు. నిలదొక్కుకోలేకపోయింది.
Nupur Sanon Beauty In Black.. ట్రెడిషనల్ అండ్ ట్రెండీనెస్.!
అలా అని బాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది నుపుర్ సనన్. కెరీర్‌లో వెనకబడి వున్నప్పటికీ స్లైలింగ్‌లో మాత్రం ముందుంటుంది నుపుర్ సనన్.
నుపుర్ సనన్ చేయించుకునే ఫోటో సెషన్స్‌లో ఏదో మ్యాజిక్ వుంటుంది. అందుకే ఆమె ఫోటో పోజులకు కుర్రకారు మంత్రముగ్డులైపోతుంటారు.

లేటెస్ట్‌గా నుపుర్ సనన్ పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ పోజులు నెట్టింటిని షేక్ చేస్తున్నాయ్. ట్రెండ్ అండ్ ట్రెడిషన్ మేళవింపులా వున్నాయ్ ఈ పోజుల్లో నుపుర్ అందాల విందు.
బ్లాక్ కలర్ గాగ్రా తరహా డ్రెస్‌లో ఆమె ధరించిన జ్యుయలరీ బాగా హైలైట్ అవుతోంది. అలాగే ఆమె లుక్స్‌ని ఆ జ్యుయలరీ యాక్సెసరీస్ రాయల్‌గా తీర్చి దిద్దేశాయ్.
రూబీ పెండెంట్.. కెవ్వు కేక..
ముఖ్యంగా మెడలో ధరించిన ఆ డ్రాప్ రూబీ పెండెంట్ చోకర్ ఎక్స్‌లెంట్. అలాగే, చెవులకు పెద్ద పెద్ద చాంద్‌బాలీలు ఆమె ముఖానికి కరెక్ట్ ఫిట్ అనిపించేలా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయ్.
వేలికి ధరించిన ఫ్లోరల్ స్టేట్‌మెంట్ రింగ్స్ ఆమె లుక్స్‌ని మరింత రాయల్‌గా మార్చేశాయ్.
ఫేస్‌లో మరీ సింపుల్ అని చెప్పలేం కానీ, తన కాస్ట్యూమ్‌కి సూట్ అయ్యే మేకప్‌తో అందంగా కనివిందు చేస్తోంది నుపుర్ సనన్.

అన్నింటికీ మించి ఆ నుదుటున ధరించిన నల్లటి బొట్టు డ్రస్ మ్యాచింగ్‌ని కంటిన్యూ చేస్తూ తన లుక్‌ని సంప్రదాయబద్ధంగా మార్చేసింది.
వార్మ్ బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్‌లో పక్కా కాన్ఫిడెంట్ అండ్ డైనమిక్ ఆటిట్యూడ్‌తో ఇచ్చిన నుపుర్ ఈ పోజులు అందుకే అంతలా ట్రెండ్ అవుతున్నాయ్.
‘ఫిల్హాల్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన నుపుర్ కెరీర్ ఖాతాలో ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులతో పాటూ, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు చర్ఛల దశలో వున్నట్లు సమాచారం.