Tollywood Bans Janhvi Kapoor.. చేసింది రెండే రెండు సినిమాలు. రెండిటితోనూ నటిగా సంపాదించుకున్న గొప్ప గుర్తింపు ఏమీ లేదు. ఆ మాటకొస్తే, రెండు సినిమాలూ ట్రోలింగ్కి గురయ్యాయి.!
తెలుసు కదా, ఎవరి గురించో.! ఇంకెవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించే.! తెలుగు సినీ పరిశ్రమలో ఆమె రాక గురించి మొదట్లో చాలా చర్చ జరిగింది.
‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగు తెరపై కనిపించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇక, ‘పెద్ది’ సినిమా, జాన్వీ కపూర్‌కి రెండో సినిమా. ‘దేవర’ని మించి, ట్రోలింగ్కి గురయ్యింది ‘పెద్ది’ సినిమాలోని పాత్రతో జాన్వీ కపూర్.
Tollywood Bans Janhvi Kapoor.. జాన్వీ కపూర్‌ని సరిగ్గా వాడుకోలేదు..
నో డౌట్, రెండు సినిమాల్లోనూ జాన్వీ కపూర్‌ని నటిగా సరిగ్గా వాడుకోలేదు. కానీ, ‘దేవర’ విషయంలో గుంభనంగా వుండి, ‘పెద్ది’ సినిమా విషయంలో తీవ్రమైన కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్.
ఎందుకంటే, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ నటించిన సన్నివేశాలకు కత్తెర పడింది. సినీ పరిశ్రమలో టోలింగ్ సర్వసాధారణమైపోయింది ఇటీవలి కాలంలో.
కానీ, తాను చేసిన ఎక్స్పోజింగ్ విషయంలో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు, ఈ క్రమంలో సౌత్ సినిమాని చిన్న చూపు చూసిన వైనం.. విమర్శలకు దారి తీసింది.
తాజాగా, ఓ ప్రాజెక్ట్ కోసం జాన్వీ కపూర్ పేరు తెరపైకి వస్తే, ‘వద్దులే, ఇంకో హీరోయిన్ని చూసుకుందాం’ అని, జాన్వీ కపూర్ పేరుని లైట్ తీసుకున్నారట.
నచ్చకపోతే.. అప్పుడే చెప్పాలి..
ఇలాంటివే, ఇటీవలి కాలంలో ఓ రెండు మూడు జరిగినట్లు ప్రచారమూ జరుగుతోంది. సినిమాల్లో గ్లామర్ కొత్తేమీ కాదు. మితిమీరిన వల్గారిటీ కూడా చూస్తూనే వున్నాం.
ఓ తాప్సీ, ఓ రాధికా ఆప్టే, ఓ జాన్వీ కపూర్.. ఇలా జాన్వీ కపూర్‌ని ‘వేరే లిస్టులో’ పడేస్తున్నారిప్పుడు.!
Also Read: నుపుర్ సనన్ మెస్మరైజింగ్ మెరుపుల్.! బ్లాక్ ఔట్ ఫిట్‌లో పర్ఫెక్ట్ ఫిట్.!
సినిమాకి ఒప్పుకున్నప్పుడే, అన్నీ ఆలోచించుకోవాలి.. చేస్తున్నప్పుడే, అన్నీ చూసుకోవాలి.. నచ్చకపోతే, ‘నో’ చెప్పాలి. సినిమా పూర్తయి, విడుదలయ్యాక.. ‘పొరపాటు’ అంటే, కుదరదు.
ఏదీ మార్చడానికి వుండదక్కడ.! ట్రోలింగ్ జరిగితే, ఎదుర్కోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. తప్పెవరిది.? అంటే, అందరిదీ.!