బిగ్‌బాస్ సీజన్ 3లో తొలి భార్యా భర్తలుగా వరుణ్ – వితికల పేర్లు హిస్టరీలో ఉండిపోతాయి. అలా బిగ్‌బాస్‌కి వీరిద్దరూ ఎప్పటికీ స్పెషల్. అయితే, ఎందుకో బిగ్ హౌస్‌లో వరుణ్, వితికలకు (Varun Vithika Bigg Fruit) అన్యాయం జరుగుతోందనిపిస్తోంది. మొదట్లో హౌస్‌లో అగ్రెసివ్‌గా కనిపించిన వరుణ్, వితికలు ఎందుకో డల్ అయినట్లు కనిపిస్తున్నారు.
హోస్ట్ నాగార్జున, సన్‌డే – ఫన్‌డే మూవ్‌లో భాగంగా, వరుణ్‌ని ఫ్రూట్‌గా మార్చేశాడు. దాంతో వరుణ్‌లోని అగ్రెసివ్‌నెస్ కాస్తా, డల్‌గా మారిపోయింది. ఏదో తన భార్య సరదాగా భర్తని ఆటపట్టించడానికి అనుకున్న మాట కాస్తా, ఏకంగా నాగార్జున చేతుల మీదుగా అవార్డ్‌గా మారి, వరుణ్ తలకెక్కేసింది. దాంతో, అందరి నోళ్లలోనూ వరుణ్ ఫ్రూట్‌లా నానుతున్నాడు.
గతవారం హౌస్ నుండి బయటికొచ్చిన రోహిణి (Rohini) కూడా వరుణ్‌ని ‘ఫ్రూట్’గానే అభివర్ణించింది. దాంతో అది వరుణ్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఇకపోతే, వితిక విషయానికి వస్తే, చాలా స్ట్రాంగ్.. వరుణ్ కన్నా స్ట్రాంగ్ అంటూ ప్రొజెక్ట్ అయ్యింది. కానీ, ప్రతీ చిన్న విషయాన్నీ చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటుంది.. అనే ముద్ర పడిపోయింది వితికపై. దాంతో, ఆమె కూడా డల్ అయిపోయింది.
తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో కూడా, వితికనే (Vithika Sheru) విన్ అవుతుందని అనుకున్నారంతా. కానీ, చాలా సింపుల్‌గా ఓడిపోయి, ఆ ఛాన్స్ సావిత్రక్కకి ఇచ్చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే, వరుణ్, వితికలకు నిజంగానే బిగ్ బాస్ అన్యాయం చేశారనే టాక్ వారి అభిమానుల నుండి వినిపిస్తోంది. ఎక్కడో అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందా.? అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఆశ్చర్యకరంగా తాజా ఎపిసోడ్ లలో ఇంతవరకూ డల్‌గా ఉన్న కంటెస్టెంట్స్ యాక్టివ్ అయిపోయారు.
హిమజ (Himaja), ఆషూ రెడ్డి (Ashu Reddy) తదితరులు యాక్టివ్ మోడ్ ప్రదర్శిస్తూ, హౌస్‌లో హైలైట్ అవుతున్నారు. టాలెంట్ టాస్క్‌లో భాగంగా, వరుణ్ – వితికల (Varun Vithika Bigg Fruit) పర్‌ఫామెన్స్ కూడా సో సో గానే సాగింది. ఇదిలా ఉంటే, ప్రతీ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కానీ, ఇద్దరూ కానీ పక్కా నామినేషన్స్‌లో ఉండేవారు. కానీ, ఈ వారం వీరిద్దరిలో ఏ ఒక్కరూ నామినేట్ కాకపోవడం విశేషం.